రాజస్తాన్‌లో 19 కొత్త జిల్లాలు

Rajasthan CM Ashok Gehlot announces formation of 19 new districts, 3 divisions - Sakshi

జైపూర్‌: రాజస్తాన్‌లో కొత్తగా 19 జిల్లాలను, మూడు డివిజన్లను ఏర్పాటు చేయనున్నట్లు ముఖ్యమంత్రి అశోక్‌ గహ్లోత్‌ శుక్రవారం అసెంబ్లీలో ప్రకటించారు. దీంతో రాష్ట్రంలో జిల్లాల సంఖ్య 50కి చేరనుంది. 2008 తర్వాత రాష్ట్రంలో కొత్త జిల్లాల ఏర్పాటు ఇదే తొలిసారి.

కొత్త జిల్లాల్లో అత్యధికంగా జైపూర్‌లో నాలుగు జిల్లాలు, జోథ్‌పూర్‌లో మూడు ఏర్పాటు కానున్నట్టు గహ్లోత్‌ వెల్లడించారు. కొత్త జిల్లాలు, డివిజన్లలో మౌలిక వసతులు, మానవ వనరుల కల్పనకు బడ్జెట్‌లో రూ.2 వేల కోట్లు కేటాయించామన్నారు. విస్తీర్ణపరంగా దేశంలో రాజస్తాన్‌ అతిపెద్ద రాష్ట్రమన్న విషయం తెలిసిందే.

మరిన్ని వార్తలు :

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top