‘కరోనా ఒక సాకు.. యాత్ర ఆపేందుకు కొత్త పన్నాగం’.. కేంద్రం లేఖపై రాహుల్‌ ఫైర్‌

Rahul Gandhi Says Covid Just Excuse To Stop Bharat Jodo Yatra - Sakshi

చండీగఢ్‌: కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కోవిడ్‌ మార్గదర్శకాలు పాటించలేకపోతే భారత్‌ జోడో యాత్రను నిలిపేయాలంటూ కేంద్ర ఆరోగ్య శాఖ లేఖ రాయటంపై షాకింగ్‌ కామెంట్స్‌ చేశారు కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ. అది భారత్‌ జోడో యాత్రను ఆపేందుకు చూపిస్తున్న ఒక సాకుగా కేంద్రంపై విమర్శలు గుప్పించారు. భారత్‌ జోడో యాత్రకు అంతరాయం కలిగించేందుకు ఆకస్మికంగా కరోనా చర్యలను తెరపైకి తీసుకొచ్చారని కాంగ్రెస్‌ ప్రచార విభాగం ఇంఛార్జ్‌ జైరాం రమేశ్‌ పేర్కొన్న కొన్ని గంటల్లోనే ఆయన మాటలతో ఏకీభవించారు రాహుల్‌ గాంధీ. హరియాణాలోని నుహ్‌ ప్రాంతంలో మీడియా సమావేశంలో మాట్లాడారు. 

‘ఈ యాత్ర కశ్మీర్‌ వరకు కొనసాగుతుంది. ఇది వారి(బీజేపీ) కొత్త పన్నాగం, కరోనా వస్తోంది యాత్రను ఆపేయండీ అంటూ నాకు లేఖ రాశారు. ఇవన్నీ యాత్రను ఆపేందుకు చూపుతోన్న సాకులు మాత్రమే. వారు ఈ దేశం బలం, నిజానికి భయపడుతున్నారు.’ అని పేర్కొన్నారు రాహుల్‌ గాంధీ. 

ఇదీ చదవండి: రాహుల్‌ గాంధీకి కేంద్రం హెచ్చరిక.. నిబంధనలు పాటించకుంటే జోడో యాత్ర నిలిపి వేయాలని ఆదేశం

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top