
ఢిల్లీ: అండమాన్ నికోబార్ దీవుల్లో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్‌పై తీవత్ర 6.2 గా నమోదైంది. అర్ధరాత్రి (జులై 29) రాత్రి 12:11 గంటల సమయంలో ఒక్కసారిగా భూ ప్రకంపనలు చోటుచేసుకున్నాయి. స్థానిక ప్రజలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. కాంప్‌బెల్ బే నుంచి 62 కి.మీ. పశ్చిమ-నైరుతి దిశలో, భూమి ఉపరితలం నుండి 10 కి.మీ. లోతులో భూకంపం సంభవించినట్లు ఎన్‌సీఎస్ వెల్లడించింది. అయితే దీని వల్ల ఎటువంటి ఆస్తి, ప్రాణ నష్టం జరగలేదు.
హిందూ మహాసముద్రంలో, అండమాన్ నికోబార్ దీవులకు సమీపంలో భూకంప కేంద్రాన్ని గుర్తించిన అధికారులు.. దీని కేంద్రం ఇండోనేషియాలోని ఆషే ప్రావిన్స్‌లోని సబాంగ్‌కు పశ్చిమ-వాయువ్య దిశలో 259 కి.మీ దూరంలో ఉన్నట్లు యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే (USGS) తెలిపింది.