టీకాపై అపోహలు తొలగిద్దాం

PM Narendra Modi interacts with healthcare workers in Varanasi - Sakshi

వైద్య సిబ్బంది సందేశమే బలమైనది

వ్యాక్సిన్‌ అనుమతులపై రాజకీయాలు సరికాదు 

వారణాసిలో టీకా లబ్ధిదారులతో ప్రధాని మాటా మంతీ  

లక్నో: కరోనా వ్యాక్సిన్‌కు హడావుడిగా ఇచ్చిన అనుమతులపై రాజకీయాలు చేయడం తగదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హితవు పలికారు. రాజకీయ నాయకులు అక్కడా, ఇక్కడా ఏవేవో మాట్లాడుతూ ఉంటారని, కానీ శాస్త్రవేత్తల నిర్ణయం మేరకే తాను ముందుకి అడుగులు వేశానని అన్నారు. సాధారణ ప్రజల్లో వ్యాక్సిన్‌ పట్ల నెలకొన్న భయాందోళనలను తొలగించాల్సిన అవసరం ఉందన్నారు. ఉత్తరప్రదేశ్‌లోని తన సొంత నియోజకవర్గం వారణాసిలో కరోనా వ్యాక్సిన్‌ తీసుకున్న వైద్య సిబ్బందితో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ముచ్చటించారు.

‘‘కరోనా టీకా భద్రత, సామర్థ్యంపై ప్రజల్లో ఎన్నో అపోహలున్నాయి. టీకా తీసుకున్న ఆరోగ్య సిబ్బంది వ్యాక్సిన్‌కు క్లీన్‌ చిట్‌ ఇస్తే ప్రజల్లో గట్టి సందేశం వెళుతుంది’’అని ప్రధాని అన్నారు. కరోనా వ్యాక్సిన్‌ తీసుకున్న ఆస్పత్రి మాట్రన్, నర్సు, ల్యాబ్‌ టెక్నీషియన్, డాక్టర్‌లతో ప్రధాని 30 నిముషాల సేపు మాట్లాడారు. మోదీతో మాట్లాడిన వారందరూ తమకు వ్యాక్సిన్‌ వల్ల ఎలాంటి సైడ్‌ అఫెక్ట్‌లు రాలేదని వెల్లడించారు. వారణాసి జిల్లా మహిళా ఆస్పత్రి మాట్రాన్‌ పుష్ప దేవితో తొలుత మోదీ మాట్లాడారు.

కరోనా వ్యాక్సిన్‌ సురక్షితమైనదన్న నమ్మకం మీకుందా అని ప్రశ్నించారు. దానికి ఆమె టీకా తీసుకోవడం తన అదృష్టంగా భావిస్తున్నట్టు తెలిపారు. ‘‘వ్యాక్సిన్‌ అంటే ఒక ఇంజక్షన్‌ తీసుకోవడం లాంటిదే. దీని వల్ల ఎలాంటి దుష్ప్రభావాలు లేవు. అందరినీ టీకా తీసుకోవాలని నేను చెబుతున్నాను’’అని ఆమె వెల్లడించారు. డీడీయూ ఆస్పత్రి చీఫ్‌ డాక్టర్‌ వి శుక్లాతో మాట్లాడిన ప్రధాని కరోనా సంక్షోభ సమయంలో వైద్య సిబ్బంది చేసిన కృషిని ప్రశంసించారు. డాక్టర్‌ శుక్లా కూడా వ్యాక్సిన్‌తో మేలే జరుగుతుందని అన్నారు. ఎవరికైనా సైడ్‌ అఫెక్ట్‌లు వచ్చినా దానికి వారి అనారోగ్య సమస్యలే కారణమని చెప్పారు. టీకా ఇవ్వడంలో ఆస్పత్రుల మధ్య పోటీ ఉంటే రెండో విడతని త్వరగా ప్రారంభించవచ్చునని ప్రధాని సూచించారు.  

శాస్త్రవేత్తలు చెప్పిందే చేశాం  
హైదరాబాద్‌లోని భారత్‌ బయోటెక్‌ అభివృద్ధి చేసిన కొవాగ్జిన్‌ వ్యాక్సిన్‌ అత్యవసర వినియోగానికి అనుమతులు ఇవ్వడంపై చెలరేగిన విమర్శల్ని ఈ  సందర్భంగా ప్రధాని పరోక్షంగా ప్రస్తావించారు. టీకా విషయంలో రాజకీయాలు చేయడం ఎంత మాత్రమూ తగదని అన్నారు.‘‘వ్యాక్సిన్‌కి అనుమతులివ్వడంపై నేను ఒక్కటే చెబుతాను. శాస్త్రవేత్తలు చెప్పినట్టే చేశాను. ఇది రాజకీయ నాయకుల పని కాదు’’అని అన్నారు. వ్యాక్సిన్‌ త్వరగా అందుబాటులోకి రాకపోవడంతో తాను ఎంతో ఒత్తిడిని ఎదుర్కొన్నట్టు మోదీ చెప్పారు.

మోదీకి హసీనా ధన్యవాదాలు
కరోనా వ్యాక్సిన్‌ కోవిషీల్డ్‌ 20 లక్షల డోసుల్ని భారత్‌ కానుకగా పంపించడంపై బంగ్లా ప్రధాని షేక్‌ హసీనా హర్షం వ్యక్తం చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ధన్యవాదాలు తెలిపారు. బంగ్లాదేశ్‌లో కరోనా కేసులు పెరిగిపోతున్న సంక్షోభ సమయంలో టీకా డోసులు అందడం ఆనందంగా ఉందన్నారు. టీకా పంపిణీకి ఇప్పటికే ప్రణాళికలు సిద్ధం చేశామని వెల్లడించారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వార్తలు

01-03-2021
Mar 01, 2021, 04:03 IST
సాక్షి, హైదరాబాద్‌: దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న 45–59 ఏళ్ల వయసు వారికి కరోనా టీకా ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది....
01-03-2021
Mar 01, 2021, 01:52 IST
వాషింగ్టన్‌: కరోనాతో అతలాకుతలమవుతున్న అగ్రరాజ్యం అమెరికా మూడో వ్యాక్సిన్‌కి అనుమతులు మంజూరు చేసింది. జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌ సంస్థ తయారు...
28-02-2021
Feb 28, 2021, 06:05 IST
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో కరోనా పాజిటివ్‌ కేసులు మళ్లీ పెరుగుతుండడం కలవరం కలిగిస్తోంది. కొన్ని రాష్ట్రాల్లో కరోనా వైరస్‌ వ్యాప్తి...
28-02-2021
Feb 28, 2021, 03:38 IST
ప్రైవేట్‌ హాస్పిటళ్లలో కరోనా టీకా ధరను కేంద్ర ప్రభుత్వం ఖరారు చేసింది. ఒక్కో డోసుకు రూ.250 వరకు వసూలు చేయొచ్చని...
27-02-2021
Feb 27, 2021, 14:54 IST
.అన్ని ప్రభుత్వ వ్యాక్సినేషన్‌ సెంటర్ల వద్ద ఉచితంగానే టీకా ఇస్తారని, కానీ ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్లాలని భావిస్తే ముందుగా నిర్ణయించిన...
27-02-2021
Feb 27, 2021, 13:29 IST
దౌత్యవేత్తలు దాదాపు 32 గంటల పాటు ట్రాలీని రైలు పట్టాలపై తోసుకుంటూ
25-02-2021
Feb 25, 2021, 10:24 IST
సాక్షి, ముంబై : పుణేకు చెందిన అజయ్‌ మునోత్‌ (50) అనే వ్యక్తి ప్లాస్మా దానం చేసి ఏకంగా తొమ్మిది...
25-02-2021
Feb 25, 2021, 09:52 IST
జంక్‌ఫుడ్‌ జోలికీ వెళ్లకుండా పసుపురంగులోని కిస్‌మిస్‌లను రోజూ తినడం వల్ల ఆరోగ్యంగా ఉన్నారు
25-02-2021
Feb 25, 2021, 09:15 IST
అక్రా: భారత్‌లోని పుణెలో సీరమ్‌ ఇనిస్టిట్యూట్‌ తయారు చేస్తున్న కోవిషీల్డ్‌ కోవిడ్‌ వ్యాక్సిన్‌ 6 లక్షల డోసులు ఘనా దేశానికి చేరుకున్నాయి....
25-02-2021
Feb 25, 2021, 03:43 IST
సాక్షి, అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా పోలీస్‌ సిబ్బందికి కోవిడ్‌ వ్యాక్సిన్‌ అందించే కార్యక్రమం మొదలైంది. మంగళగిరిలోని పోలీస్‌ ప్రధాన కార్యాలయంలో బుధవారం...
25-02-2021
Feb 25, 2021, 01:15 IST
సాక్షి ముంబై: మహారాష్ట్రలో కరోనా మహమ్మారి మళ్లీ ఉధృతరూపం దాల్చుతోంది. వాషీం జిల్లా రిసోడ్‌ తాలూకా దేగావ్‌లోని ఓ రెసిడెన్షియల్‌...
24-02-2021
Feb 24, 2021, 10:14 IST
మాస్క్‌ ధరించని వారి నుంచి ఏకంగా 30,50,00,000 రూపాయలు వసూలు
24-02-2021
Feb 24, 2021, 03:16 IST
కరోనా టైంలో చాలా దేశాల్లో లాక్‌డౌన్‌ పెట్టారు.. మన దగ్గరా పెట్టారు.. ఇంతకీ ఈ ఉపద్రవం సమయంలో అత్యంత కఠినంగా...
24-02-2021
Feb 24, 2021, 03:14 IST
పొరుగునే ఉన్న మహారాష్ట్రలో కరోనా కేసులు వేగంగా వ్యాప్తి చెందుతుండటంతో అంతర్రాష్ట్ర సరిహద్దుల్లో కోవిడ్‌ భయం నెలకొంది.
23-02-2021
Feb 23, 2021, 18:58 IST
సాక్షి, హైదరాబాద్‌ : దేశంలో కొత్త రకం కరోనా వైరస్‌ తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. దేశవ్యాప్తంగా మూడు రాష్ట్రాల్లో కరోనా...
23-02-2021
Feb 23, 2021, 04:09 IST
న్యూఢిల్లీ: దేశంలో ప్రైవేట్‌ రంగం భాగస్వామ్యంతో కోవిడ్‌–19 వ్యాక్సినేషన్‌ సామర్థ్యాన్ని గణనీయంగా పెంచవచ్చని విప్రో వ్యవస్థాపకుడు అజీమ్‌ ప్రేమ్‌జీ అభిప్రాయపడ్డారు....
23-02-2021
Feb 23, 2021, 03:09 IST
న్యూఢిల్లీ: దేశంలో కొన్ని రాష్ట్రాల్లో కోవిడ్‌ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర హోంమంత్రి అమిత్‌షా కేంద్ర వైద్య శాఖాధికారులతో సోమవారం...
23-02-2021
Feb 23, 2021, 02:55 IST
లండన్‌: యూకేలో ప్రస్తుతం అమలవుతున్న కోవిడ్‌ లాక్‌డౌన్‌ ఆంక్షలను నాలుగు దశల్లో ఎత్తి వేసేందుకు ఉద్దేశించిన రోడ్‌ మ్యాప్‌ను ప్రధానమంత్రి...
22-02-2021
Feb 22, 2021, 15:11 IST
ముంబై సెంట్రల్ ‌: ముంబై నగర పరిసర ప్రాంతాల్లో గత వారం రోజులుగా కరోనా మహమ్మారి వేగంగా విస్తరిస్తోంది. ఈసారి...
22-02-2021
Feb 22, 2021, 11:34 IST
రానున్న 8-15 రోజుల్లో రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య ఇలానే పెరిగితే  లాక్‌డౌన్‌ తప్పదు
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top