
న్యూఢిల్లీ: గాజాలో శాంతి నెలకొల్పేందుకు అమెరికా అధ్యక్షుడు చేసిన ప్రయత్నాన్ని ఉద్దేశించి ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసలు కురిపించారు. గాజాలో శాంతి కోసం 20 సూత్రాల ప్రణాళికకు హమాస్ ఒప్పుకోవడంలో ట్రంప్ కీలక పాత్ర పోషించారన్నారు.
‘గాజా వివాదాన్ని అంతం చేయడానికి అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన సమగ్ర ప్రణాళికను మేము స్వాగతిస్తున్నాము. ఇది పాలస్తీనా, ఇజ్రాయెల్ ప్రజలకు, అలాగే విస్తృత పశ్చిమాసియా ప్రాంతానికి దీర్ఘకాలిక స్థిరమైన శాంతి భద్రతలు ఏర్పడటానికి , ఇది ఆ దేశాల అభివృద్ధికి ఆచరణీయమైన మార్గాన్ని అందిస్తుంది’ అంటూ ప్రధాని మోదీ పేర్కొన్నారు. ఈ మేరకు మోదీ తన సోషల్ మీడియా ఖాతా ‘ఎక్స్’లో పోస్ట్ చేశారు.
గాజాలో శాంతిని నెలకొల్పే క్రమంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చొరవకు సంబంధిత వారందరూ కలిసి వస్తారని, ఏళ్ల తరబడి సాగుబడి సాగుతున్న సంఘర్షణను అంతం చేయడానికి, శాంతిని స్థాపించే ఈ ప్రయత్నానికి మద్దతు ఇస్తారని మేము ఆశిస్తున్నాము’ అని మోదీ తన పోస్ట్‌లో పేర్కొన్నారు.
We welcome President Donald J. Trump’s announcement of a comprehensive plan to end the Gaza conflict. It provides a viable pathway to long term and sustainable peace, security and development for the Palestinian and Israeli people, as also for the larger West Asian region. We…
— Narendra Modi (@narendramodi) September 30, 2025
కాగా, గాజాలో యుద్ధానికి శాశ్వత పరిష్కారం చూపే దిశగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రతిపాదించిన ఇరవై సూత్రాల శాంతి ప్రణాళికపై హమాస్ కీలక నిర్ణయం తీసుకుంది. ట్రంప్ విధించిన గడువులోగా ఇజ్రాయెల్ బందీలందరినీ విడుదల చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు హమాస్ ప్రకటించింది. గాజాలో దీర్ఘకాలంగా కొనసాగుతున్న యుద్ధానికి ముగింపు పలికి, పశ్చిమాసియాలో శాంతిని నెలకొల్పేందుకు ట్రంప్ ఈ ప్రణాళికను ప్రకటించారు. హమాస్‌కు ఆదివారం వరకూ గడువు ఇవ్వగా, వారు ముందుగానే ఒప్పుకోవడం గమనార్హం.
ట్రంప్ ప్రణాళికపై హమాస్ కీలక నిర్ణయం.. బందీల అప్పగింతకు మొగ్గు