భవనంలో మంటలు.. ఏడుగురు మృతి | Peoples killed during massive fire in Mumbai residential building | Sakshi
Sakshi News home page

భవనంలో మంటలు.. ఏడుగురు మృతి

Oct 7 2023 6:15 AM | Updated on Oct 7 2023 6:15 AM

Peoples killed during massive fire in Mumbai residential building - Sakshi

ముంబై: ముంబైలోని ఓ నివాస భవనంలో శుక్రవారం వేకువజామున చెలరేగిన మంటల్లో ఇద్దరు చిన్నారులు సహా ఏడుగురు మృతి చెందారు. మరో 68 మంది గాయపడ్డారు. గోరెగావ్‌ వెస్ట్‌లోని ఏడంతస్తుల నివాస భవనంలో తెల్లవారు జామున 3 గంటల సమయంలో మంటలు ప్రారంభమయ్యాయి. సమాచారం అందుకుని ఫైర్‌ సిబ్బంది అక్కడికి చేరుకునే సరికి అగ్ని కీలలు భవనాన్నంతటినీ చుట్టుముట్టాయి.

పార్కింగ్‌ ప్లేస్‌లోని దుకాణాలు, ద్విచక్ర వాహనాలతోపాటు, భారీగా నిల్వ ఉంచిన పాత దుస్తులు తగులబడిపోయాయి. వివిధ అంతస్తులతోపాటు టెర్రస్‌పై చిక్కుకున్న సుమారు 30 మందిని ఫైర్‌ సిబ్బంది కాపాడారు. గాయపడిన వారిని ఆస్పత్రులకు తరలించారు. ఆస్పత్రుల్లో ఒక మహిళ, ఇద్దరు చిన్నారులు సహా ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. వీరంతా ఊపిరాడకనే చనిపోయినట్లు అధికారులు తెలిపారు. గాయపడిన 68 మందిలో అయిదుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement