Parliament Monsoon Session 2021: మూడవ రోజు లైవ్‌ అప్‌డేట్స్‌

Parliament Monsoon Session 2021 3rd Day Live Updates And Highlights In Telugu - Sakshi

లోక్‌సభ రేపటికి వాయిదా పడింది. తిరిగి శుక్రవారం ఉదయం 11 గంటలకు సమావేశాలు ఆరంభం కానున్నాయి.
విపక్షాల ఆందోళన మధ్య రాజ్యసభ రేపటికి వాయిదా పడగా.. లోక్‌ సభ సాయంత్రం నాలుగు గంటలకు వాయిదా పడింది.

లోక్‌ సభలో వైఎస్సార్‌ సీపీ ఎంపీల ఆందోళన.. రాజ్యసభ వాయిదా..
మధ్యాహ్నం 12 గంటలకు ఉభయ సభలు తిరిగి ప్రారంభమయ్యాయి. లోక్‌ సభలో వైఎస్సార్‌ సీపీ ఎంపీలు ఆందోళన చేపట్టారు. విపక్షాల ఆందోళన నేపథ్యంలో ప్రారంభమైన కొద్దిసేపటికే రాజ్యసభ వాయిదా పడింది. సభ మధ్యాహ్నం 2 గంటలకు తిరిగి ప్రారంభం కానుంది.

ఉభయ సభలు వాయిదా : 
మూడవ రోజు పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాలు ప్రారంభమైన కొద్దిసేపటికే ఉభయ సభలు వాయిదా పడ్డాయి. విపక్షాల ఆందోళనల మధ్య సభలు మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా పడ్డాయి.

లోక్‌ సభలో వైఎస్సార్‌ సీపీ ఎంపీ అవినాష్‌ రెడ్డి మాట్లాడుతూ.. ‘‘ నిబంధనలకు విరుద్ధంగా తెలంగాణ ప్రభుత్వం వ్యవహరిస్తోంది. అనేక ప్రాజెక్టులను తెలంగాణ ప్రభుత్వం కడుతోంది.. విభజన చట్టానికి భిన్నంగా.. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న.. తెలంగాణ ప్రభుత్వంపై చర్యలు తీసుకోవాలి’’ అని కోరారు. దీనిపై కేంద్ర మంత్రి షెకావత్‌  సమాధానం ఇస్తూ.. ‘‘ ఏపీ వాదన సరైందే, నిబంధనలకు విరుద్ధంగా విద్యుత్ ఉత్పత్తి చేస్తున్న.. తెలంగాణ ప్రభుత్వానికి లేఖలు కూడా రాశాం. ఈ సమస్య పరిష్కారానికే గెజిట్ విడుదల చేశాం’’ అని అన్నారు.


                 కేంద్ర మంత్రి షెకావత్‌

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top