ఖైబర్‌ ప్రావిన్స్‌లో అత్యవసర పరిస్థితి | Pakistan Declares Emergency Rule In Imran Khan’s PTI Ruled Khyber Pakhtunkhwa Province, Check Details | Sakshi
Sakshi News home page

ఖైబర్‌ ప్రావిన్స్‌లో అత్యవసర పరిస్థితి

Oct 11 2026 5:02 PM | Updated on Oct 12 2026 5:07 AM

 Pakistan imposes emergency rule in ​province governed by Imran Khan party

శాంతిభద్రతలు దారుణంగా క్షీణించాయన్న పాక్‌ అధ్యక్షుడు

ఇస్లామాబాద్‌: పాకిస్తాన్‌లోని  ఖైబర్‌ పక్వున్వా ప్రావిన్స్‌లో శాంతిభద్రతలు దారుణంగా క్షీణించాయంటూ ప్రభుత్వం అత్యవసర పరిస్థితి విధించింది. దీంతో ఈ ప్రావిన్స్‌లో మాజీ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌కు చెందిన పార్టీ అధికారం కోల్పోయినట్లయింది. రాజ్యాంగ పాలన, భద్రతాపరమైన సంక్షోభం కారణాలతో విధించే అత్యవసర పరిస్థితి సమయంలో కేంద్రప్రభుత్వానికి విశేషాధికారాలు సంక్రమిస్తాయి. 

ప్రావిన్స్‌లో ఉగ్రదాడులు పెరిగిపోయాయని, రాజ్యాంగ యంత్రాంగం విఫలమైందని అధ్యక్షుడు అసిఫ్‌ జర్దారీ పేర్కొన్నారు. దీంతో ప్రావిన్స్‌ సీఎం, మంత్రులు, సలహాదారులు, ప్రత్యేక సహాయకులు, అడ్వొకేట్‌ జనరల్‌ తమ పదవులను కోల్పోతారు. పాకిస్తాన్‌లో ఇమ్రాన్‌ పార్టీ పాకిస్తాన్‌ తెహ్రీక్‌–ఇ–ఇన్సాఫ్‌(పీటీఐ) అధికారంలో ఉన్న ఏకైక ప్రావిన్స్‌ ఇదే కావడం గమనార్హం. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement