స్థానిక లాక్‌డౌన్‌లతో భారీగా ఉద్యోగాలు కోల్పోయిన ప్రజలు

Over 75 lakh people lose jobs in April as lockdowns sprout - Sakshi

దేశంలో రోజు రోజుకి కరోనా కేసులు, మరణాల సంఖ్య విపరీతంగా పెరుగుతుంది. కోవిడ్-19 సెకండ్ వేవ్ కారణంగా చాలా రాష్ట్రాలు స్థానికంగా లాక్‌డౌన్‌లు విధించాయి. ఈ లాక్‌డౌన్‌ల వల్ల 75లక్షల మందికి పైగా తమ ఉద్యోగాలను కోల్పోయారు. నిరుద్యోగిత రేటు కూడా గత నాలుగు నెలల కంటే గరిష్ట స్థాయి 8 శాతానికి చేరుకున్నట్లు సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ (సీఎంఐఇ) సోమవారం తెలిపింది. ఒకవేల ఇది ఇలాగే కొనసాగితే దేశానికి సవాలుగా మారనుందని సీఎంఐఇ మేనేజింగ్ డైరెక్టర్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ మహేష్ వ్యాస్ తెలిపారు. "మార్చితో పోలిస్తే ఏప్రిల్ నెలలో 75 లక్షల ఉద్యోగాలు కోల్పోయారు. అదే నిరుద్యోగిత రేటు పెరగడానికి కారణమైంది "అని ఆయన చెప్పారు. 

జాతీయ నిరుద్యోగిత రేటు గణాంకాల ప్రకారం 7.97 శాతానికి చేరుకుంది. పట్టణ ప్రాంతాలలో నిరుద్యోగిత రేటు 9.78 శాతం, గ్రామీణ నిరుద్యోగం 7.13 శాతంగా ఉన్నాయి. మార్చిలో జాతీయ నిరుద్యోగిత రేటు 6.50 శాతంగా ఉంది. గత ఏడాది పోలిస్తే కేసుల సంఖ్య వేగంగా పెరగడంతో రాష్ట్రాలు స్థానికంగా లాక్‌డౌన్‌లు విధించాయి. అంతిమంగా లాక్‌డౌన్‌ ప్రభావం ఉద్యోగాల మీద పడింది. గత ఏడాది నిరుద్యోగిత రేటు 24 శాతం పోలిస్తే అంతగా లేకున్నప్పటికి కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది అన్నారు. ఇది ఇలా ఉంటే దేశంలో రోజుకు 4 లక్షల కొత్త కరోనా కేసులు, 3,000 మందికి పైగా మరణాలు సంభవిస్తున్నాయి.

చదవండి:

బ్యాంకుల్లో నిరుపయోగంగా రూ.60 వేల కోట్లు?

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top