ఢిల్లీలో మరోసారి హైటెన్షన్ వాతావరణం నెలకొంది. సీఈసీ రాజీనామా డిమాండ్‌తో విపక్షాలు కన్నాట్ ప్లేసు నుంచి సుప్రీంకోర్టుకు ర్యాలీగా బయిలుదేరాయి. సీఈసీ రాజీనామా డిమాండ్. ఎస్‌ఐఆర్ ప్రక్రియను వెంటనే ఆపాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. దీంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఎన్నికల వ్యవస్థలో అవకతవకలు 'ఓట్ చోరీ' ఆరోపణలపై 'ఇండి' కూటమి నేతలతో, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ నేతృత్వంలో ఈ ర్యాలీ నిర్వహిస్తున్నారు.
ర్యాలీ సందర్భంగా సీఈసీ జ్ఞానేష్ కుమార్‌పై రాహుల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన గురించి పూర్తి సమాచారం తన వద్ద ఉందని రెండు వందల మంది అధికారులు తనతో టచ్‌లో ఉన్నారని పేర్కొన్నారు. సీఈసీకి వ్యతిరేకంగా న్యాయపోరాటం చేస్తాం ఎట్టి పరిస్థితుల్లో జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాల్సిందేనని పేర్కొన్నారు. సుప్రీంకోర్టులో జ్ఞానేశ్ కుమార్‌పై పిటిషన్ వేస్తామన్నారు.
కాగా విపక్షాలను కలవడానికి సీజేఐ అపాయింట్‌మెంట్ నిరాకరించారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (CJI) జస్టిస్ సూర్యకాంత్‌ను కలిసి మెమొరాండం సమర్పించాలని తొలుత విపక్ష నేతలు భావించారు. అయితే కోర్టులో చర్చించాల్సిన అంశాలు కోర్టు పరిశీలనలో ఉన్నందున, పరిపాలనాపరమైన విషయాల్లో కోర్టు జోక్యం చేసుకోలేదని పేర్కొంటూ సీజేఐ ఈ భేటీని నిరాకరించారు.శాంతిభద్రతల సమస్యలను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన లేఖ ద్వారా వివరించారు.
ఢిల్లీ నిరసనల వేళ న్యాయవాదులు, కక్షిదారులు ,కోర్టు సిబ్బంది రాకపోకలకు ఎలాంటి అడ్డంకులు సృష్టించకూడదని సీజేఐ స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.
ఇదీ చదవండి: జంతర్ మంతర్‌పై సంచలన నిర్ణయం


