చెత్త రోడ్డుమీద పడేశాడని ట్రోలింగ్‌  | Online Trolling Leads To Goa Student Tragic Suicide | Sakshi
Sakshi News home page

చెత్త రోడ్డుమీద పడేశాడని ట్రోలింగ్‌ 

Jun 6 2026 5:25 AM | Updated on Jun 6 2026 5:25 AM

Online Trolling Leads To Goa Student Tragic Suicide

తట్టుకోలేక ఆత్మహత్యచేసుకున్న యువకుడు 

పణజి: ఇంట్లో చెత్తను మూటగట్టి రోడ్డు మీద పడేసిన యువకుడు ఆన్‌లైన్‌లో వేధింపులు భరించలేక చివరకు తనను తాను షూట్‌చేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన గోవాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం గత వారం నార్త్‌ గోవాలోని మపూసా పట్టణంలో 23 ఏళ్ల కాలేజీ విద్యార్థి శామ్యూల్‌ గారి్వన్‌ డీ బ్రాగెన్కా ఇంట్లో పోగైన చెత్తను మూటగట్టి రోడ్డు పక్కన పడేశాడు. దీనిని రోడ్డున పోతున్న ఒక వ్యక్తి వీడియో తీసి ఆన్‌లైన్‌లో పోస్ట్‌చేశాడు. 

చెత్తను రోడ్డున పడేయకుండా మున్సిపల్‌ చెత్తకుండీలో పడేయాలనే ఇంగితజ్ఞానం కూడా లేదు అని విమర్శించాడు. ఈ వీడియోకు ఆన్‌లైన్‌లో తెగ షేర్‌లు, లైకులు వచ్చాయి. శామూŠయ్‌ల్‌ను తిట్టిపోస్తూ ఆన్‌లైన్‌లో వేధింపులు ఎక్కువయ్యాయి. వీడియో విషయం చివరకు పోలీసుల దాకా చేరింది. దీంతో భారతీయ న్యాయసంహితలోని 271 సెక్షన్, గోవా బయోడిగ్రేడబుల్‌ గార్బేజ్‌ కంట్రోల్‌ చట్టాల కింద కేసు నమోదుచేశారు. శామ్యూల్‌ను పోలీస్‌స్టేషన్‌కు పిలించి మందలించారు. 

కేసు విచారణను ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. దీంతో మానసికంగా కుంగిపోయిన శామ్యూల్‌ గురువారం రాత్రి సొంతింట్లో బాత్రూమ్‌లో షూట్‌ చేసుకుని చనిపోయాడు. దీంతో శుక్రవారం కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. చెత్తను పడేస్తున్నప్పుడు వీడియో తీసిన వ్యక్తిని అరెస్ట్‌చేయాలని, ఆత్మహత్య చేసుకునేంతగా ఆన్‌లైన్‌ వేధింపులకు పాల్పడిన వ్యక్తులపై కేసు నమోదుచేయాలని కుటుంబసభ్యులు ఫిర్యాదుచేశారు. ఈ విషయం ముఖ్యమంత్రి ప్రమోద్‌ సావంత్‌ దృష్టికెళ్లింది. ఈ మొత్తం ఉదంతంపై దర్యాప్తు జరపాలని పోలీసులకు సీఎం ఆదేశాలిచ్చారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement