బెలూన్‌లో గాలి నింపే హీలియం ట్యాంక్‌ పేలి... ఒకరు మృతి | One Person Died After Helium Tank Exploded Four Injuured | Sakshi
Sakshi News home page

బెలూన్‌లో గాలి నింపే హీలియం ట్యాంక్‌ పేలి... ఒకరు మృతి

Published Mon, Oct 3 2022 4:22 PM | Last Updated on Mon, Oct 3 2022 4:23 PM

One Person Died After Helium Tank Exploded Four Injuured - Sakshi

బెలూన్‌లో గాలి నింపే హీలియం ట్యాంక్‌ పేలడంతో ఒకరు మృతి చెందగా, నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన తమిళనాడు తిరుచ్చిలో చోటు చేసుకుంది. పోలీసుల తెలిపిన కథనం ప్రకారం..బెలూన్‌లు అమ్మే వ్యక్తి నార్సింగ్‌ నిర్లక్యం కారణంగా ఈ ప్రమాదం సంభవించినట్లు పోలీసులు పేర్కొన్నారు. ఈ ఘటనలో మృతి చెందిన బాధితుడు 35 ఏళ్ల రవిగా గుర్తించారు. 

అతను బెలూన్‌లు కొనడానికి వచ్చి మృతి చెందినట్లు తెలిపారు. ఈ ఘటనలో నలుగురైదుగురు వ్యక్తుల స్వల్ప గాయాలతో బయటపడ్డారని అ‍న్నారు. ఈ పేలుడులో ద్విచక్రవాహనాలు, ఒక ఆటోరిక్షా దారుణంగా ధ్వంసం అయ్యాయని తెలిపారు. ఈ ఘటన మొత్తం టెక్స్‌టైల్‌ ఫోరూం సమీపంలోని సీసీటీవీలో రికార్డు అయ్యింది. ఆ వీడియోలో షాపు బయట ఒక వ్యక్తి బెలూన్‌లు అమ్ముతున్నాడు. కాసేపటికి హఠాత్తుగా పేలుడు సంభవించింది తదనంతరం సమీపంలోని జనాలంతా భయంతో పరుగులు తీస్తున్నట్లు కనిపిస్తోంది.

(చదవండి: పండగ వేళ విషాదం..కొడుకు మృతిని జీర్ణించుకోలేక ఆగిన తండ్రి గుండె)
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement