తల్లీబిడ్డ క్షేమంగా ఉండడంతో కుటుంబీకుల హర్షం

Odisha: Covid Patient Born New Baby In Ganjam District - Sakshi

బరంపురం: గంజాం జిల్లా పులసరా బ్లాక్‌ ప్రాంతానికి చెందిన కోవిడ్‌ బాధిత గర్భిణి సోమవారం మహిళా సిటీ అసుపత్రిలో ప్రసవించారు. డెడికేటెడ్‌ కోవిడ్‌కేర్‌ సెంటర్‌లో చికిత్స పొందుతున్న ఆమె అడశిశువుకు జన్మనిచ్చారు. శిశువుకు పరీక్షలు నిర్వహించిన వైద్యుడు ప్రశాంతకుమార్‌ మాట్లాడుతూ.. బిడ్డకు కోవిడ్‌ లక్షణాలేమీ లేవని తెలిపారు. ప్రస్తుతం తల్లి, బిడ్డ క్షేమంగా ఉన్నారని ఆయన పేర్కొన్నారు. కొందమాల్‌ జిల్లా చకాపదా సమితి పరిధిలో ఓ నిండు గర్భిణి కరోనాతో బాధపడుతూ బ్రాహ్మణపధా ఆరోగ్య కేంద్రంలో చికిత్స పొందుతూ అడబిడ్డకు జన్మనిచ్చారు. ఇక్కడ కూడా తల్లి, బిడ్టా క్షేమంగా ఉన్నట్లు వైద్యులు పేర్కొన్నారు.  
 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top