
పట్నా: బీహార్‌లో ఈ ఏడాది చివరిలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపధ్యంలో సీఎం నితీష్ కుమార్ పలు ఎన్నికల హామీలను గుప్పించారు. తమ ప్రభుత్వం రాబోయే ఐదేళ్లలో యువతకు కోటి ఉద్యోగాలు కల్పిస్తుందన్నారు. 2020లో ‘సాత్ నిశ్చయ్-2’ కార్యక్రమం కింద నిర్దేశించిన లక్ష్యల మేరకు ప్రభుత్వ ఉద్యోగాలు, ఇతర ఉపాధి మార్గాల ద్వారా ప్రభుత్వం ఇప్పటికే 50 లక్షల మంది యువతకు ఉపాధి కల్పించిందని సిఎం వివరించారు.
2020 में सात निश्चय-2 के तहत की गई घोषणा के क्रम में हमारी सरकार ने 50 लाख युवाओं को सरकारी नौकरी एवं रोजगार देने के लक्ष्य को पूरा कर लिया है। अब हमारी सरकार ने अगले 5 वर्षों में 1 करोड़ युवाओं को नौकरी एवं रोजगार देने का लक्ष्य रखा है। राज्य में उद्योग लगाने और स्वरोजगार करने…
— Nitish Kumar (@NitishKumar) August 16, 2025
సీఎం నితీష్ కుమార్ తన ‘ఎక్స్’ ఖాతాలో తమ ప్రభుత్వం చేపట్టబోయే కార్యక్రమాలను తెలియజేశారు. తమ ప్రభుత్వం కొత్త వ్యాపారాలకు ప్రోత్సాహకాలను అందిస్తుందని, బీహార్‌లో పెట్టుబడులు పెట్టాలనుకునే వ్యవస్థాపకులకు ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీని అందిస్తామని తెలిపారు. తమ ప్రభుత్వం రాబోయే ఐదేళ్లలో కోటి మంది యువతకు ఉద్యోగాలు, ఉపాధి కల్పించాలని లక్ష్యంగా పెట్టుకుందన్నారు. బీహార్‌లో పరిశ్రమలను ప్రోత్సహించేందుకు సీఎం నితీష్ కుమార్ చేసిన ప్రధాన హామీలివే..
ప్రోత్సాహకాలు రెట్టింపు
మూలధన సబ్సిడీ, వడ్డీ సబ్సిడీ, జీఎస్‌టీ రీయంబర్స్‌మెంట్ కోసం అందించిన మొత్తాన్ని రెట్టింపు చేయడం.
పరిశ్రమలకు భూమి
పరిశ్రమల స్థాపన కోసం ప్రతి జిల్లాలో భూమిని కేటాయించనున్నారు.
ఉపాధికి ఉచిత భూమి
అధికంగా ఉపాధిని కల్పించే పరిశ్రమలకు ఉచితంగా భూమి ఇవ్వనున్నారు.
భూ వివాదాల పరిష్కారం
పరిశ్రమల కోసం కేటాయించిన భూమికి సంబంధించిన ఏవైనా వివాదాలు వెంటనే పరిష్కరించనున్నారు.
కాలపరిమితి ప్రయోజనాలు
ఈ ప్రయోజనాలు రాబోయే ఆరు నెలల్లో పరిశ్రమలను స్థాపించే వ్యవస్థాపకులకు అందనున్నాయి.