భారత చట్టాలకు లోబడి పని చేయాల్సిందే | Sakshi
Sakshi News home page

భారత చట్టాలకు లోబడి పని చేయాల్సిందే

Published Thu, Mar 2 2023 5:53 AM

Must comply fully with Indian laws: Jaishankar tells UK leader over BBC tax survey - Sakshi

న్యూఢిల్లీ: భారత్‌లో పని చేసే సంస్థలన్నీ ఇక్కడి చట్టాలకు, నియమ నిబంధనలకు లోబడి నడుచుకోవాల్సిందేనని బ్రిటన్‌కు కేంద్రం స్పష్టం చేసింది. రెండు రోజుల జీ–20 మంత్రుల సదస్సులో పాల్గొనేందుకు భారత్‌ వచ్చిన బ్రిటన్‌ విదేశాంగ మంత్రి జేమ్స్‌ క్లెవర్లీ బుధవారం విదేశాంగ మంత్రి జై శంకర్‌తో భేటీ అయ్యారు. పలు ద్వైపాక్షిక అంశాలపై వారు సుదీర్ఘంగా చర్చించారు.

బీబీసీపై పన్ను ఎగవేత ఆరోపణలు, ఢిల్లీ, ముంబైల్లోని ఆ సంస్థ కార్యాలయాల్లో సీబీఐ సర్వే ఉదంతాన్ని ఈ సందర్భంగా క్లెవర్లీ ప్రస్తావించారు. ఏ సంస్థలైనా ఇక్కడి పూర్తిగా చట్టాలకు లోబడి పని చేయాలని జై శంకర్‌ గట్టిగా బదులిచ్చినట్టు కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. పలు అంతర్జాతీయ పరిణామాలపైనా తామిద్దరం లోతుగా చర్చలు జరిపామంటూ అనంతరం జై శంకర్‌ ట్వీట్‌ చేశారు. 

Advertisement
Advertisement