Viral Video: అంత బలుపెందుకు.. నువ్వు సెలబ్రెటీవా!

Moj Based Influencer Kajal Abusively Kicking Dog Video Viral - Sakshi

మూగ జీవాలను హింసించిన కేసుల్లో ఇప్పటికే పలువురు సెలబ్రెటీలపై సోషల్‌ మీడియాలో ఆగ్రహ జ్వాలలు వెల్లువెత్తాయి. సోషల్‌ మీడియాలో గుర్తింపు కోసం లేదా హిట్స్‌ కోసం కొందరు మూగజీవాలను శారీరకంగా భాధివంచారు. తాజాగా అలాంటి ఘటనే ఒకటి సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. దీనికి కారణమైన ఓ ఈ-సెలబ్రెటీపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

వివరాల ప్రకారం.. ఇన్‌స్టాగ్రామ్‌లో విపరీతమైన ఫాలోయింగ్‌ ఉన్న మోజ్-ఆధారిత ఇన్‌ఫ్లుయెన్సర్ కాజల్‌ అనుచితంగా ప్రవర్తించింది. అయితే, సోషల్‌ మీడియాలో రీల్‌ పోస్ట్‌ చేయడం కోసం ఆమె.. ఓవర్‌గా బిహేవ్‌ చేసింది. కాగా, వీడియోలో కుక్కపై లేని ప్రేమను నటించి.. దాన్ని మచ్చిక చేసుకున్నట్టు ప్రవర్తించి.. చివరకు కుక్కను కాలితో తన్నింది. అనంతరం.. కాజల్‌ నువ్వుతూ అక్కడి నుంచి వెళ్లిపోయింది. 

కాగా, దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక, వీడియోను యూపీ, నోయిడా పోలీసులకు రీట్వీట్‌ చేసి ఆమెపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తున్నారు. మరోవైపు.. ఇన్‌ఫ్లుయెన్సర్‌ కాజల్‌కు మోజ్ యాప్‌లో దాదాపు 2.2 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్నారు. ఇక, ఇన్‌స్టాగ్రామ్‌లో సంఖ్య 121K మంది ఫాలోవర్స్‌ కాజల్‌ను ఫాలో అవుతున్నారు. 

మరిన్ని వార్తలు :

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top