ఐఎన్‌ఎస్‌ ప్రెసిడెంట్‌గా మోహిత్‌ జైన్‌ | Mohit Jain, K Raja Prasad Reddy elected INS President and deputy president | Sakshi
Sakshi News home page

ఐఎన్‌ఎస్‌ ప్రెసిడెంట్‌గా మోహిత్‌ జైన్‌

Dec 18 2021 4:34 AM | Updated on Dec 18 2021 4:34 AM

Mohit Jain, K Raja Prasad Reddy elected INS President and deputy president - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: ది ఇండియన్‌ న్యూస్‌పేపర్‌ సొసైటీ (ఐఎన్‌ఎస్‌) ప్రెసిడెంట్‌గా ఎకనమిక్‌ టైమ్స్‌కు చెందిన మోహిత్‌ జైన్‌ ఎన్నికయ్యారు. ఐఎన్‌ఎస్‌ డిప్యూటీ ప్రెసిడెంట్‌గా ‘సాక్షి’ దినపత్రిక అడ్వర్టయిజింగ్‌ అండ్‌ మార్కెటింగ్‌ డైరెక్టర్‌ కె.రాజప్రసాద్‌ రెడ్డి ఎన్నికయ్యారు. శుక్రవారం వర్చువల్‌ విధానంలో జరిగిన సొసైటీ 82వ వార్షిక సాధారణ సమావేశంలో 2021–22 సంవత్సరానికి ఐఎన్‌ఎస్‌ కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. ఐఎన్‌ఎస్‌ అధ్యక్షుడిగా కొనసాగిన ‘హెల్త్‌  అండ్‌ యాంటిసెప్టిక్‌’కు చెందిన ఎల్‌.ఆదిమూలం నుంచి మోహిత్‌ జైన్‌ బాధ్యతలు స్వీకరించారు. రాకేష్‌ శర్మ (ఆజ్‌ సమాజ్‌)ను వైస్‌ ప్రెసిడెంట్‌గా, తన్మయ్‌ మహేశ్వరి (అమర్‌ ఉజాలా)ని గౌరవ కోశాధికారిగా ఎన్నుకున్నట్లు సొసైటీ సెక్రటరీ జనరల్‌ మేరీ పాల్‌ తెలిపారు. కార్యనిర్వాహక కమిటీ సభ్యులుగా ఎన్నికైన 41 మందిలో ‘అన్నదాత’.. ఐ. వెంకట్‌ ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement