జనం పేరుతో రూ.50 లక్షల అప్పులు | Microfinance Rs. 50 lakh debt couple | Sakshi
Sakshi News home page

జనం పేరుతో రూ.50 లక్షల అప్పులు

Jan 30 2025 9:29 AM | Updated on Jan 30 2025 11:46 AM

Microfinance Rs. 50 lakh debt couple

ఘరానా దంపతుల పరార్‌

తుమకూరు(కర్ణాటక): సుమారు 10కి పైగా మైక్రో ఫైనాన్స్‌(Microfinance) కంపెనీల నుంచి గ్రామస్తుల పేరుతో అప్పులు తీసుకుని ఘరానా దంపతులు పారిపోయారు. తుమకూరు జిల్లాలోని మధుగిరి తాలూకాలో ఈ సంఘటన జరిగింది. తాలూకా సమీపంలోని దొడ్డహోసహళ్ళి ఉండే ప్రతాప్‌, రత్నమ్మ దంపతులు సమారు 35 మంది గ్రామస్తుల పేరుతో ఆధార్‌ కార్డు, ఇతర దాఖలాలు తీసుకున్నారు. పలు మైక్రో ఫైనాన్స్‌ కంపెనీలలో వాటిని చూపించి రూ. 50 లక్షల వరకు రుణాలు పొందారు.

 రెండు నెలల పాటు కంతులు కడుతున్నట్లు నమ్మించారు. ఆ డబ్బుతో గ్రామం నుంచి జారుకున్నారు. మరోవైపు ఫైనాన్స్‌ సంస్థల సిబ్బంది వచ్చి మీరు అప్పు తీసుకున్నారు, చెల్లించండి అని గ్రామస్తులను ఒత్తిడి చేస్తున్నారు. సుమారు 35 మంది గ్రామస్తులు రూపాయి కూడా తీసుకోకుండా లక్షలాది రూపాయల అప్పుల బారిన పడ్డారు. 2 నెలల నుంచి మోసకారి దంపతుల జాడ లేదని తెలిపారు. చేయని అప్పులను తామెందుకు చెల్లించాలని పలువురు బాధితులు ప్రశ్నించారు. దీంతో గ్రామంలో అలజడి నెలకొంది.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement