లాక్‌డౌన్‌ ఎత్తేస్తారట !

MH Govt Likely  To Ease Lockdown  - Sakshi

అన్‌లాక్‌కి సిద్ధమవుతున్న మహారాష్ట్ర

నాలుగు దశల్లో లాక్‌డౌన్‌ ఎత్తివేతకు కసరత్తు

ముంబై:లాక్‌డౌన్‌ సడలింపుల దిశగా మహరాష్ట్ర సర్కారు అడుగులు వేస్తోంది. ఆ రాష్ట్రంలో క్రమంగా కేసులు తగ్గుముఖం పట్టడంతో పాటు మరణాలు తగ్గిపోతున్నాయి. మరోవైపు పాజిటివిటీ రేటు కూడా ప్రమాదకర స్థాయి కిందికి చేరుకుంది.  దీంతో లాక్‌డౌన్‌ ఎత్తివేయాలనే యోచనలో అక్కడి ప్రభుత్వం ఉంది. అయితే ఒకేసారి లాక్‌డౌన్‌ నిబంధనలు మొత్తం సడలించరని.. దశల వారీగానే అన్‌లాక్‌ ప్రక్రియ ఉంటుందని ఆ రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి రాజేశ్‌ తోపే తెలిపారు.

30 నాటికి అన్‌లాక్‌ పూర్తి
మహరాష్ట్రలో ప్రస్తుతం పరిస్థితులు అదుపులోకి వస్తున్నాయన్నారు మంత్రి రాజేశ్‌తోపే. జూన్‌ 30 నాటికి అన్‌లాక్ పూర్తవుతుందని.. అయితే ఎప్పటి నుంచి అన్‌లాక్‌ ప్రారంభించాలనే అంశంపై ఇంకా క్లారిటీ రాలేదన్నారు. సీఎం, డిప్యూటీ సీఎంలు అన్‌లాక్‌పై చర్చించి నిర్ణయం తీసుకుంటారని మంత్రి అన్నారు.

4 దశల్లో
మొత్తం నాలుగు దశల్లో అన్‌లాక్‌ అమలు చేయనున్నారు. మొదటి దశలో  నిత్యవసర వస్తువులు అమ్మే షాపులు తెరుచుకునేందుకు అనుమతి ఇవ్వాలని నిర్ణయించారు. అలా ఒకర్కో రంగానికి లాక్‌డౌన్‌ నుంచి మినహాయింపు ఇస్తూ మొత్తం నాలుగు దశలో సాధారణ పరిస్థితులు నెలకొనేలా చూస్తారు. అయితే ఆగష్టు నుంచి అక్టోబరు మధ్య కాలంలో థర్ఢ్‌ వేవ్‌ ముప్పు  సూచనలు ఉన్నందున పూర్తి స్థాయి అన్‌లాక్‌ చేయోద్దంటున్నారు వైద్య నిపుణులు. 

క్రమంగా 
దేశవ్యాప్తంగా అంతులేని విషాదం సృష్టించిన కరోనా సెకండ్‌ వేవ్‌ మహరాష్ట్ర నుంచే మొదలైంది. రోజుకు వేల సంఖ్యలో కేసులు, వందల సంఖ్యలో మరణాలు రావడంతో అందరి కంటే ముందుగా మహారాష్ట్ర లాక్‌డౌన్‌ విధించింది. ఇప్పుడు అన్‌లాక్‌ ప్రక్రియ కూడా మహరాష్ట్ర నుంచే మొదలు కానుంది. దీంతో దేశం క్రమంగా అన్‌లాక్‌ దిశగా అడుగులు వేసే అవకాశం ఉంది
 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top