ఎంఐఎంతో పొత్తు.. ఉత్త ప్రచారమే!: మాయావతి

Mayawati Condemns Claims About Alliance With AIMIM For UP polls - Sakshi

లక్నో: తెలుగు రాష్ట్రాలతో పాటు మిగతా రాష్ట్రాల ఎన్నికల్లో పోటీ ద్వారా తమ ఉనికిని చాటాలని ఎంఐఎం పార్టీ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఈ తరుణంలో వచ్చే ఏడాది జరగబోయే ఉత్తర ప్రదేశ్‌లో ఎన్నికల్లోనూ పోటీకి సిద్ధమైంది. అయితే ఎంఐఎం.. బహుజన్‌ సమాజ్‌ పార్టీతో జంటగా బరిలోకి దిగబోతుందని కథనాలు ప్రసారం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో బీఎస్పీ చీఫ్‌ మాయావతి స్పందించారు. ఎంఐఎంతో ఎట్టిపరిస్థితుల్లో పొత్తు ఉండబోదని తేల్చి చెప్పారు. (చదవండి: మాయావతిపై డర్టీ కామెంట్లు)

‘‘విధాన సభ ఎన్నికల్లో అసదుద్దీన్‌ ఒవైసీ నేతృత్వంలోని ఎంఐఎంతో పొత్తు ఉంటుందని కథనాలు ప్రసారం చేస్తున్నారు. అది నిరాధారమైన వార్త అది. నిజం కాదు. ఖండిస్తున్నాం’’ అని ట్విటర్‌ ద్వారా ప్రకటించారమె. అంతేకాదు ఉత్తర ప్రదేశ్‌తో పాటు ఉత్తరాఖండ్‌ ఎన్నికల్లోనూ ఒంటరిగానే పోటీ చేయబోతున్నట్లు ఆమె ప్రకటించారు. అయితే పంజాబ్‌లో మాత్రం అకాళీదల్‌తో పొత్తు ఉంటుందని మరోసారి స్పష్టం చేశారు. పంజాబ్‌ తప్ప వేరే ఏ పార్టీతోనూ పొత్తులు ఉండబోవు. ఇది ఫైనల్‌ అండ్‌ క్లియర్‌.. అని స్పష్టం చేశారామె.

తప్పుడు ప్రచారాలు ఆపండి..
బీఎస్పీ పార్టీపై వరుసగా తప్పుడు కథనాలు ప్రసారం చేస్తున్నారంటూ కొన్ని మీడియా ఛానెళ్లపై యూపీ మాజీ సీఎం మాయావతి మండిపడ్డారు. ఎంఐఎంతో పొత్తు విషయంతో పాటు రాజ్యసభ ఎంపీ సతీష్‌ చంద్ర గురించి ఫేక్‌ కథనాలు ప్రసారం చేశారు. ఈ నేపథ్యంలోనే తప్పుడు ప్రచారాలు ఆపండి అంటూ మీడియాను ఆమె కోరారు. ఏదైనా ప్రసారం చేసే ముందు బీఎస్పీ కార్యాలయాన్ని సంప్రదించాలని.. ఇలాంటివి రిపీట్‌ అయితే పరువు నష్టం దావా వేస్తానని ఆమె హెచ్చరించారు.

చదవండి: ఇంకెన్నాళ్లు కాంగ్రెస్‌కు బానిసగా ఉంటారు

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top