సూరత్‌లో భారీ అగ్ని ప్రమాదం | Massive Fire Breaks Out At ONGC Plant In Surat | Sakshi
Sakshi News home page

ఓఎన్‌జీసీ ప్లాంట్‌లో చెలరేగిన మంటలు

Sep 24 2020 7:52 AM | Updated on Sep 24 2020 9:59 AM

Massive Fire Breaks Out At ONGC Plant In Surat - Sakshi

గాంధీనగర్‌: గుజరాత్‌లో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. రాష్ట్రంలోని ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ (ఓఎన్‌జీసీ) ప్లాంట్‌లో గురువారం తెల్లవారుజామున ఈ ప్రమాదం జరిగింది. ప్రాథమిక సమాచారం ప్రకారం నేడు తెల్లవారుజామున 3:30 గంటలకు సూరత్‌లోని హజీరా ఆధారిత ఓఎన్‌జీసీ ప్లాంట్‌లోని రెండు టెర్మినల్స్ వద్ద పేలుడు సంభవించింది. భారీ ఎత్తున మంటలు చెలరేగాయి. పేలుడు శబ్దం 10 కిలోమీటర్ల వరకు వినిపించిందని స్థానికులు తెలిపారు. ఎంతో దూరం వరకు మంటలు కనిపించాయి. అయితే ఇప్పటి వరకు ఎలాంటి ప్రాణ నష్టం సంభవించలేదని అధికారులు తెలిపారు. ప్రమాదం గురించి తెలిసిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలతో పాటు పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. (చదవండి: పాపం.. శానిటైజర్‌ ఎంత పని చేసింది!)

Advertisement
 
Advertisement
Advertisement