ఢిల్లీలో ఏం జరుగుతోంది.. శ్రద్ధా మర్డర్‌ తరహాలో మరో దారుణం!

Manpreet Singh Kills Live In Partner Rekha Vani In Delhi - Sakshi

దేశ రాజధాని ఢిల్లీలో మహిళలు, యువతులపై వరుస క్రైమ్‌లు స్థానికులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఇటీవలే శ్రద్ధా వాకర్ హత్య కేసు దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన విషయం తెలిసిందే. తాజాగా అదే తరహాలో మరో వివాహిత దారుణ హత్యకు గురైంది. 

వివరాల ప్రకారం.. పశ్చిమ ఢిల్లీ తిలక్ నగర్‌కు చెందిన వివాహిత రేఖా రాణి(35) మన్‌ప్రీత్ సింగ్‌ అనే వ్యక్తితో సహజీవనం చేస్తోంది. అయితే, అప్పటికే పెళ్లై పిల్లలున్న మన్‌ప్రీత్‌.. 2015 నుంచి రేఖా వాణితో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు. మరోవైపు.. రేఖకు 16 ఏళ్ల కూతురు కూడా ఉంది. ఇదిలా ఉండగా.. కొన్నేళ్లుగా వీరి మధ్య వివాహేతర సంబంధం కొనసాగుతుండగా ఇటీవలి కాలంలో చాలాసార్లు గొడవపడ్డారు. దీంతో, రేఖ అడ్డుతొలగించుకోవాలని మన్‌ప్రీత్‌ భావించాడు. 

ఈ క్రమంలోనే ఆమెను చంపాలని డిసైడ్‌ అయ్యాడు. అనుకున్నదే తడవుగా మన్‌ప్రీత్‌.. డిసెంబర్‌ 1వ తేదీన రేఖ ఇంటికి వెళ్లాడు. అనంతరం, రాత్రి రేఖ కుమార్తెకు నిద్రమాత్రలు వేసి, ఆమె నిద్ర పోయిన తర్వాత తన వెంట తెచ్చుకున్న కత్తితో రేఖను దారుణంగా నరికి చంపాడు. సెకోలా వ్యవహరించి ఆమె మెడపై కత్తితో కోసి, కుడి చేతి వేలును కోసివేశాడు. ఇలా పైశాచికత్వం ప్రదర్శించాడు. కాగా, నిద్రలో నుంచి లేచి చూసేసరికి రేఖ మృతదేహాన్ని చూసి కూతురు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ కన్నీరుపెట్టుకుంది. 

దీంతో, రంగంలోకి దిగిన పోలీసులు.. నిందితుడు రేఖ శరీరాన్ని కత్తితో భాగాలు చేయాలని ముందుగా అనుకున్నప్పటికీ.. కుమార్తె గుర్తిస్తుందని భయపడినట్లు పోలీసులు వెల్లడించారు. రేఖ కూమర్తె ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్నట్టు పోలీసులు తెలిపారు. అయితే, మన్‌ప్రీత్ ఇప్పటికే పలు కేసుల్లో నిందితుడిగా ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top