మణిపూర్‌ సీఎం సంచలన వ్యాఖ్యలు | Manipur Cm Biren Singh Sensational Comments On Migrants | Sakshi
Sakshi News home page

వారందరూ వెళ్లాల్సిందే.. మణిపూర్‌ సీఎం సంచలన వ్యాఖ్యలు

Published Tue, Feb 13 2024 1:20 PM | Last Updated on Tue, Feb 13 2024 3:34 PM

Manipur Cm Biren Singh Sensational Comments On Migrants - Sakshi

ఇంఫాల్‌: మణిపూర్‌ సీఎం బీరెన్‌ సింగ్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. 1961 తర్వాత రాష్ట్రంలోకి వచ్చి నివాసం ఏర్పాటు చేసుకున్న వారందరినీ గుర్తించి పంపించి వేస్తామని ప్రకటించారు. ఇంఫాల్‌లో ఓ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.  కులం, మతంతో సంబంధం లేకుండా అలాంటి వారందరినీ రాష్ట్రం నుంచి వెళ్లగొడతామని చెప్పారు.

మణిపూర్‌కు చెందిన తెగల ఉనికిని కాపాడేందుకే ఈ చర్యలు చేపడుతున్నామని తెలిపారు. ఇటీవల రాష్ట్రంలో జరిగిన హింస, అల్లర్లకు అక్రమ వలసదారులు, డ్రగ్స్‌, ముఖ్యంగా మయన్మార్‌ నుంచి వచ్చిన శరణార్థులు కారణమన్నారు.

‘ప్రస్తుతం కష్టకాలంలో ఉన్నాం. ఇక్కడ ఉనికి కోసం పోరాటం జరుగుతోంది. ప్రస్తుత తరం అభద్రతాభావంతో ఉంది. భారత్‌ మయన్మార్‌ మధ్య ఫ్రీ మూమెంట్‌ రిజైమ్‌(ఎఫ్‌ఎమ్‌ఆర్‌)ఇక ఉండదు. రెండు దేశాల మధ్య కంచె నిర్మిస్తాం. ఈ తరం ఎదుర్కొంటున్న అభద్రతాభావం ముందు తరాలకు ఉండకూడదు’ అని బీరెన్‌సింగ్‌ అన్నారు.  

ఇదీ చదవండి.. ఎన్సీపీ నాదే.. సుప్రీంకోర్టుకు శరద్‌పవార్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement