కోతి కళ్లుజోడుని ఎలా తిరిగి ఇచ్చిందో చూడండి!

The man Tried To Exploit The Copycat Behaviour Of The Monkey To Get His Glasses Back.  - Sakshi

మన ఇళ్లలోని వస్తువులను కోతులు ఏవిధంగా ఎత్తుకుపోతాయో అందరికీ తెలుసు. ఆ వస్తువులను కోతులు తీసుకెళ్లి ఎక్కడో పడేస్తాయి తప్ప అవి మనకు దొరికే అవకాశం కూడా ఉండదు. కానీ అందుకు విరుద్ధంగా ఇక్కడోక కోతి ఒక వ్యక్తి కళ్లజోడుని ఎత్తుకుపోయి మళ్లా తిరిగి ఇచ్చేసింది. అలా ఎలా ఇచ్చేసిందబ్బా  అనిపిస్తుందా? అనుమానంగా ఉందా? అయితే తెలుసుకుందాం రండి.

(చదవండి: చీరకట్టు ‘ప్రియుడు’.. ఇది ఏ ఫ్యాషనో తెలుసా?)

వివరాల్లోకెళ్లితే.....ఐపీఎస్‌ ఆఫీసర్‌ రూపిన్‌ శర్మ కళ్లజోడుని ఒక కోతి ఎత్తుకుపోతుంది. పైగా ఆ కళ్లజోడు పట్టుకుని ఒక మెస్‌పై కుర్చోంటుంది. దీంతో మొదట అతనికి ఏం చేయాలో తోచదు. ఆ తర్వాత ఆయన ఒక జ్యూస్‌ ప్యాక్‌ని తీసుకువచ్చి కోతికి ఇస్తాడు. కోతులు సహజసిద్ధంగా ఉండే అనుకరించే బుద్ది కారణంగా ఆ కోతి జ్యూస్‌ ప్యాక్‌ని తీసుకుని కళ్లజోడుని మెస్‌ మీద నుంచి వదిలేస్తుంది. అయితే ఆ కళ్లజోడు మెస్‌లో ఇరుక్కుపోతుంది.

అయినప్పటికీ ఆ తెలివైన కోతీ ఆ మెస్‌లో ఇరుక్కుపోతున్న కళ్లజోడుని తీసి మరీ శర్మకి తిరిగి ఇస్తుంది. దీనికి సంబంధించిన వీడియోకి "ఒక చేత్తో తీసకుంటూ ఇంకో చేత్తో ఇచ్చింది" అనే క్యాప్షన్‌ జోడించి ట్టిట్టర్‌లో పోస్ట్‌ చేశారు. దీంతో ఆ వీడియో కాస్త  నెట్టింట తెగ వైరల్‌ అవుతోంది. అంతేకాదు నెటిజన్లు తినేందుకు ఏమి ఇవ్వకపోతే కోతులు మనవస్తువులను అంత తేలిగ్గా తిరగి ఇవ్వవు అంటూ రకరకాలు ట్వీట్‌ చేశారు.

(చదవండి: హృదయాన్ని కదిలించే ‘స్వీట్‌ రిక్వస్ట్‌’)

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top