హృదయాన్ని కదిలించే ‘స్వీట్‌ రిక్వస్ట్‌’

The Sweet Message By The Uber Driver Onur Is Now Going Viral On Social Media  - Sakshi

లండన్‌: ఇటీవల కాలంలో అందరూ ఉబర్‌, ఓలా, ఆన్‌లైన్‌ రైడ్‌ యాప్‌ల ద్వారా క్యాబ్‌లు బుక్‌ చేసుకుని ప్రయాణిస్తున్నారు. దీంతో మనకు ప్రయాణం చాలా సౌకర్యవంతంగానూ మంచి వెసులబాటుగానూ ఉంటుంది. మంచి రద్దీ సమయంలో ఈ క్యాబ్‌ల సాయంతో త్వరితగతిన వెళ్లవచ్చు.

(చదవండి: వివాహ వేడుకకు అతిధిలా వచ్చిన ఎలుగుబంటి)

అయితే మనం క్యాబ్‌ బుక్‌ చేసుకున్నప్పుడు ఆ క్యాబ్‌ మనల్ని పికప్‌ చేయించుకుని పాయింట్‌కి రీచ్‌ కాకపోతే వెంటనే సదరు డ్రైవర్‌కి కాల్‌ చేసి అడుగుతాం. కానీ కొంతమంది డ్రైవర్‌తో మాట్లాడటం ఇష్టం లేకనో లేక మరో ఇతర కారణాలతోనో కేవలం మెసేజ్‌లను పెడతారు. కానీ కొంతమంది డ్రైవర్లు ప్రయాణికులతో మాట్లాడలేని వైకల్యంతో బాధపడే వాళ్లు ఉంటారని మనకు తెలియదు. అచ్చం అలాంటి పరిస్థతిలో లండన్‌కి చెందిన ఉబర్‌ డ్రైవర్‌ ఓనూర్ ఉన్నాడు.

వివరాల్లోకెళ్లితే....లండన్‌కి చెందిన జెరెమీ అబాట్ అనే వ్యక్తి ఉబర్‌ క్యాబ్‌ని బుక్‌ చేసుకుని ఎక్కుతున్నప్పుడు ఆ ఉబర్‌ డ్రైవర్‌ సీటుకి వెనుకవైపు ఉన్నఒక చక్కటి సందేశంతో కూడిన లెటర్‌ని చూసి ఒక్కసారిగా అవాక్కవుతాడు. ఆ లెటర్‌లోని  సందేశం ఏమిటంటే " నేను చెవిటివాడిని కాబట్టి మీరు నాకు ఏదైనా చెప్పవలసి వస్తే, దయచేసి ఫోన్‌లో టెక్స్ట్ చేయండి లేదా నేను కారు ఆపినప్పుడు నాకు చూపించడానికి మీరు నోట్‌ప్యాడ్‌లో వ్రాయవచ్చు.

మీరు మీకు నచ్చిన సంగీతాన్ని ప్లే చేయడానికి ఏయూఎక్స్‌  కేబుల్‌ని ఉపయోగించవచ్చు. ఈ రోజు మీరు ఏం కావల్సిన బాస్‌లా అడగండి చేస్తాను. ఈ ట్రిప్‌ని నేను కూడా మీతోపాటు ఎంజాయ్‌ చేస్తాను. ఈ రోజు నాకు చాలా మంచి రోజు. అంతేకాదు మీరు నాతో సహకరిస్తున్నందుకు ధన్యవాదాలు." అని ఉంది. దీంతో జెరెమీ ఒక్కసారిగా ఆశ్చర్యపోతాడు.  తాను తన జీవిత కాలంలో ఎక్కిన ఉబెర్‌ క్యాబ్‌ల కంటే ఈ క్యాబ్‌ తనకు ప్రత్యేకం అని చెప్పాడు.

ఈ మేరకు జెరెమీ ఈ ఉబర్‌ డ్రైవర్‌ సందేశంతోపాటు  ఓనూర్‌ గ్రేట్‌ హిరో అంటూ ట్యాగ్‌లైన​ జోడించి  ట్విట్టర్‌లో పోస్ట్‌ చేశాడు. ప్రస్తుతం ఆ పోస్ట్‌ నెట్టింట తెగ వైరల్‌ అయ్యింది. దీంతో  నెటిజన్ల ఈ సందేశం ఎంత హృదయపూర్వకంగా ఉందో అంటూ ఓనూర్‌ కష్టపడేతత్వాన్ని, మర్యాదపూర్వక స్వభావాన్ని ప్రశంసిస్తు ‍ట్వీట్‌ చేశారు. 

(చదవండి: కూరగాయల దండతో అసెంబ్లీకి)

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top