తండ్రి చికిత్స కోసం.. నకిలీ ఐడీ కార్డుతో ఎయిర్‌ఫోర్స్‌ స్టేషన్‌లోకి | Sakshi
Sakshi News home page

తండ్రి చికిత్స కోసం.. నకిలీ ఐడీ కార్డుతో ఎయిర్‌ఫోర్స్‌ స్టేషన్‌లోకి

Published Fri, Feb 23 2024 8:10 PM

A Man Entered Into Palam Airforce Station With Fake Id Card - Sakshi

న్యూఢిల్లీ: నకిలీ ఐడీ కార్డుతో ఓ వ్యక్తి ఢిల్లీ కంటోన్మెంట్‌లోని పాలం ఎయిర్‌ఫోర్స్ స్టేషన్‌లోకి  ప్రవేశించాడు. ఈవిషయాన్ని గుర్తించి అప్రమత్తమైన సిబ్బంది వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో పోలీసులు రంగప్రవేశం చేసి ఆ వ్యక్తిని అరెస్టు చేశారు. వినాయక్ చద్దా అనే వ్యక్తి తన తండ్రికి ఎయిర్ ఫోర్స్  డెంటల్ హాస్పిటల్‌లో చికిత్స చేయించేందుకు వింగ్‌  కమాండర్‌గా నటిస్తూ  లోపలికి ప్రవేశించాడు. 

నకిలీ గుర్తింపు కార్డుతో నిషేధిత ప్రాంతంలోకి ప్రవేశించేందుకు ప్రయత్నించగా ఎయిర్‌ఫోర్స్‌ సిబ్బంది అతడిని పట్టుకున్నారని పోలీసులు తెలిపారు. అతని వద్ద పలువురు రక్షణ సిబ్బంది పేర్లతో నకిలీ గుర్తింపుకార్డులు, లిక్కర్‌ క్యాంటిన్‌ కార్డులు ఉన్నాయి. కంటోన్మెంట్ ప్రాంతాల్లో సబ్సిడీ ధరలకు మద్యం కొనుగోలు చేసేందుకు రక్షణ సిబ్బందికి ఈ కార్డులు ఇస్తారు. ఈ కేసు దర్యాప్తులో భాగంగా నకిలీ కార్డులతో సంబంధమున్న సుల్తాన్‌పురికి చెందిన మరో వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేసు విచారణ కొనసాగుతోంది.

ఇదీ  చదవండి.. కమ్యూనిటీ కిచెన్‌ల ఏర్పాటుపై సుప్రీం కీలక వ్యాఖ్యలు 

Advertisement
 
Advertisement