‘ప్రజాస్వామ్యాన్ని కాపాడండి’.. సీజేఐకి దీదీ వినతి | Mamata Banerjee Urges Chief Justice of India To Save Democracy | Sakshi
Sakshi News home page

‘ప్రజాస్వామ్యాన్ని కాపాడండి’.. సీజేఐకి మమతా బెనర్జీ వినతి

Oct 30 2022 5:30 PM | Updated on Oct 30 2022 5:30 PM

Mamata Banerjee Urges Chief Justice of India To Save Democracy - Sakshi

ఈ ట్రెండ్‌ ఇలాగే కొనసాగితే దేశం రాష్ట్రపతి పాలన దిశగా వెళ్తుందని హెచ్చరించారు...

కోల్‌కతా: ప్రజాస్వామ్య వ్యవస్థలను నిర్వీర్యం చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ. ఈ ట్రెండ్‌ ఇలాగే కొనసాగితే దేశం రాష్ట్రపతి పాలన దిశగా వెళ్తుందని హెచ్చరించారు. ప్రజాస్వామ్యం, సమాఖ్య వ్యవస్థను కాపాడాలని భారత ప్రధాన న్యాయమూర్తి సీజేఐకి విజ్ఞప్తి చేశారు. కోల్‌కతాలోని  నేషనల్‌ యూనివర్సిటీ ఆఫ్‌ జురిడికల్‌ సైన్స్‌ కాన్వకేషన్‌ కార్యక్రమానికి సీజేఐ యూయూ లలిత్‌ హాజరైన క్రమంలో ఈ మేరకు వ్యాఖ్యానించారు మమత.

‘ప్రజాస్వామ్యం ఎక్కడుంది? ప్రజాస్వామ్యాన్ని కాపాడండి. వారు ఎవరినైనా దుర్భాషలాడగలరా? వారు ఎవరినైనా నిందించగలరా? సర్‌, మన గౌరవం దెబ్బతింటోంది. తీర్పు వెలువడేలోపే ఎన్నో జరిగిపోతున్నాయని చెప్పేందుకు చింతిస్తున్నాను. నేను చెప్పేది తప్పు అనుకుంటే, క్షమించండి.’అని పేర్కొన్నారు మమతా బెనర్జీ. ఎన్‌యూజేఎస్‌ ప్రపంచంలోనే అత్యుత్తమ విద్యాసంస్థల్లో ఒకటిగా అభివర్ణించారు దీదీ. ఈ సందర్భంగా సీజేఐ యూయూ లలిత్‌కు శుభాకాంక్షలు తెలిపారు.

ఇదీ చదవండి: ‘తప్పుచేశా.. క్షమించండి’..గుడిలో చోరీ చేసిన సొత్తు తిరిగిచ్చిన దొంగ

Advertisement
 
Advertisement
Advertisement