బ్రాహ్మణ పూజారులకు వరాల జల్లు..!

Mamata Banerjee Announces Free Housing For Brahmin Priests - Sakshi

కోల్‌కతా: బ్రాహ్మణ పూజారులపై పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వరాల జల్లు ప్రకటించారు. రాష్ట్రంలోని పేద బ్రాహ్మణ పూజారులకు నెలకు రూ. 1,000 ఆర్థిక సహాయంతో పాటు ఉచితంగా ఇల్లు కట్టించనున్నారు. ప్రభుత్వ నిర్ణయంతో 8,000 మంది సనాతన పేద బ్రాహ్మణ పూజారులకు ప్రయోజనం కలగనుంది. రాష్ట్రంలో వచ్చే ఏడాది(2021)లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో తాజా నిర్ణయం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ హామీపై మమత స్పందిస్తూ సనాతన బ్రాహ్మణులకు గతంలోనే కోల్‌గాట్‌లో భూకేటాయింపు చేశామని తెలిపారు.

అయితే చాలా మంది పూజారులు తీవ్ర ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటున్నారని, ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ద్వారా(నెలకు రూ.1,000తో పాటు ఉచిత ఇంటి హామీ) వారికి లబ్ధి చేకూరనుందని పేర్కొన్నారు. హిందీ దినోత్సవ రోజు సందర్భంగా రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.  ఏదో ఒక భాషకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇవ్వబోదని, అన్ని భాషలకు సమప్రాధాన్యత ఇస్తుందని పేర్కొన్నారు. కాగా రాష్ర్రంలో హిందీ సాహిత్య అకాడమీతో పాటు దళిత సాహిత్య అకాడమీని స్థాపించనున్నట్లు మమతా బెనర్జీ పేర్కొన్నారు. (చదవండి: దుర్గా పూజ ఆరోపణలు.. స్పందించిన దీదీ)

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top