breaking news
housing facilities
-
అన్నలకు గృహయోగం
వారంతా పోరుబాటలో అడవిబాట పట్టిన అన్నలు. అన్యాయంపై బంధూకు ఎక్కుపెట్టి ప్రజల పక్షాన నిలిచిన విప్లవ వీరులు. కంటి నిండా నిద్రలేక కడుపునిండా తిండిలేక ఇబ్బందులు పడ్డారు. కుటుంబాలకు దూరమై వేదన అనుభవించారు. తిరుగుబాటు యుద్ధంలో ఎందరో తూటాలకు నేలకొరిగారు. కానీ ప్రస్తుతం పాలకులు మారారు..పాలనా మారింది. ప్రజాస్వామ్యం పరిఢవిల్లుతోంది. అందుకే వారంతా జనావాసంలోకి వచ్చారు. కుటుంబాలతో కలిసి వ్యవసాయం చేసుకుంటూ సాధారణ జీవితం గడుపుతున్నారు. అలాంటి ‘మాజీ’లకు వైఎస్ జగన్ సర్కార్ అండగా నిలిచింది. నాలుగు ఎకరాల్లో 135 మందికి పట్టాలివ్వగా...వారంతా సొంతింటి కల సాకారం చేసుకుంటున్నారు. సాక్షి, పుట్టపర్తి: లొంగిపోయిన మాజీ నక్సలైట్లకు వైఎస్ జగన్ సర్కార్ అండగా నిలుస్తోంది. కుటుంబ సభ్యులతో కలిసి హాయిగా జీవించే అవకాశం కల్పిస్తోంది. ప్రభుత్వ పథకాలు అందేలా చూడటంతో పాటు సొంతింటి కలను సాకారం చేస్తోంది. ఇందులో భాగంగా పుట్టపర్తి శివారున సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి వెనుక భాగాన కప్పలబండ పొలాల్లో సుమారు 5 ఎకరాల్లో లోచెర్ల పెద్దారెడ్డి పేరుతో కాలనీ ఏర్పాటు చేసి 135 మందికి పట్టాలిచ్చింది. లొంగిపోయి.. జనజీవన స్రవంతిలోకి.. ప్రభుత్వాల హామీతో లొంగిపోయిన మాజీ నక్సల్స్ జన జీవన స్రవంతిలో కలిసిపోయారు. అందరిలా జీవించాలనే తపనతో బతుకుతున్నారు. కుటుంబ బాధ్యతలు మీద వేసుకున్నారు. పిల్లలను చదివిస్తున్నారు. రైతులుగా మారి వ్యవసాయం చేసుకుంటున్నారు. కానీ చాలా మందికి నిలువ నీడలేదు. దీంతో అంతా కలిసి వైఎస్సార్ సీపీ ప్రభుత్వానికి లేఖ రాశారు. స్పందించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇళ్ల పట్టాలు మంజూరు చేశారు. పుట్టపర్తి ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్‌రెడ్డి ఆధ్వర్యంలో 2021 మే నెలలో పట్టాల పంపిణీ జరిగింది. ప్రస్తుతం అందరూ ఓ కాలనీ ఏర్పాటు చేసుకుని ఇళ్లు నిర్మించుకుంటున్నారు. ప్రస్తుతం కాలనీలో రోడ్డు, విద్యుత్, తాగునీరు సౌకర్యం కల్పించారు. కాలనీ పూర్తి స్థాయిలో ఏర్పడేలోపు ప్రాథమిక పాఠశాలు, కుటీర పరిశ్రమలు స్థాపిస్తే ఉపాధికి ఇబ్బందులు ఉండవని వారు కోరుతున్నారు. అప్పటి బాధలు వర్ణించలేం అజ్ఞాతంలో భాగంగా పదేళ్ల పాటు అడవిలో ఉన్నా. ఆ తర్వాత ప్రభుత్వ చర్యలతో లొంగిపోయాను. ప్రస్తుతం నాపై కేసులేమీ లేవు. వ్యవసాయం చేసుకుంటున్నా. నేను 1999లోనే జన జీవన స్రవంతిలో కలసిపోయాను. అడవిలో ఉన్నప్పటి బాధలు వర్ణించలేనివి. ఎవరికీ అలాంటి బాధలు రాకూడదు. – ఆంజనేయులు, బ్రాహ్మణపల్లి, పుట్టపర్తి ఇల్లు కట్టుకుంటున్నా నేను 2007లో లొంగిపోయాను. ప్రభుత్వంతో పాటు ఎంతో మంది ప్రోత్సహిస్తున్నారు. ప్రస్తుతం వ్యవసాయం చేస్తుకుంటూ జీవనం సాగిస్తున్నా. ప్రభుత్వం స్థలం మంజూరు చేయగా...ఇల్లు నిర్మించుకుంటున్నా. – ఎస్.శ్రీనివాసులు, అమగొండపాళెం ప్రభుత్వం గుర్తించింది మా అన్న ఎన్కౌంటర్ అయ్యాడు. వదిన విశాఖపట్నం జైలులో శిక్ష అనుభవిస్తోంది. నేను 1994లోనే లొంగిపోయాను. నాపై కేసులన్నీ కొట్టేశారు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వం మమ్మల్ని గుర్తించింది. పట్టాలిచ్చి మాకంటూ కాసింత నీడనిస్తోంది. – ఎం.రంగనాయకులు, గూనిపల్లి, పుట్టపర్తి మంచి రోజులొచ్చాయి 2007లో వైఎస్ రాజశేఖరరెడ్డి సీఎంగా ఉన్న సమయంలో లొంగిపోయాను. వైఎస్సార్ హయాంలో ప్రభుత్వ పాలనపై నమ్మకం ఏర్పడింది. ఆయన మరణం తర్వాత కొన్నాళ్లు ఇబ్బందులు పడ్డాం. తర్వాత ఆయన తనయుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి సీఎం అయ్యాక మంచి రోజులు వచ్చాయి. ప్రస్తుతం వ్యవసాయం చేసుకుంటున్నా. రామాంజి, నార్సింపల్లి, బుక్కపట్నం మండలం ప్రభుత్వ కృషి మరువలేనిది మా నాన్న లోచెర్ల పెద్దారెడ్డి స్వాతంత్య్రం రాక ముందు నుంచి ప్రజా ఉద్యమాలు చేశారు. ఎమర్జెన్సీ తర్వాత నాన్నతో కలిసి నేనూ పదేళ్లు అజ్ఞాతంలో ఉన్నా. 1992లో ప్రజా జీవనంలోకి వచ్చా. కప్పలబండ పొలంలో 4.88 ఎకరాల్లో సుమారు 135 ప్లాట్లు ప్రభుత్వం మాకోసం మంజూరు చేసింది. మాజీ నక్సలైట్ల కాలనీ అని పేరు పెట్టుకున్నాం. అయితే ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్‌రెడ్డి లోచెర్ల పెద్దారెడ్డి కాలనీగా నామకరణం చేశారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం కృషి.. ఎమ్మెల్యే శ్రీధర్‌రెడ్డి చొరవ మరువలేనిది. – లోచర్ల విజయభాస్కర్‌రెడ్డి -
బ్రాహ్మణ పూజారులకు వరాల జల్లు..!
కోల్‌కతా: బ్రాహ్మణ పూజారులపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వరాల జల్లు ప్రకటించారు. రాష్ట్రంలోని పేద బ్రాహ్మణ పూజారులకు నెలకు రూ. 1,000 ఆర్థిక సహాయంతో పాటు ఉచితంగా ఇల్లు కట్టించనున్నారు. ప్రభుత్వ నిర్ణయంతో 8,000 మంది సనాతన పేద బ్రాహ్మణ పూజారులకు ప్రయోజనం కలగనుంది. రాష్ట్రంలో వచ్చే ఏడాది(2021)లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో తాజా నిర్ణయం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ హామీపై మమత స్పందిస్తూ సనాతన బ్రాహ్మణులకు గతంలోనే కోల్‌గాట్‌లో భూకేటాయింపు చేశామని తెలిపారు. అయితే చాలా మంది పూజారులు తీవ్ర ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటున్నారని, ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ద్వారా(నెలకు రూ.1,000తో పాటు ఉచిత ఇంటి హామీ) వారికి లబ్ధి చేకూరనుందని పేర్కొన్నారు. హిందీ దినోత్సవ రోజు సందర్భంగా రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఏదో ఒక భాషకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇవ్వబోదని, అన్ని భాషలకు సమప్రాధాన్యత ఇస్తుందని పేర్కొన్నారు. కాగా రాష్ర్రంలో హిందీ సాహిత్య అకాడమీతో పాటు దళిత సాహిత్య అకాడమీని స్థాపించనున్నట్లు మమతా బెనర్జీ పేర్కొన్నారు. (చదవండి: దుర్గా పూజ ఆరోపణలు.. స్పందించిన దీదీ) -
మేమూ మనుషులమే
ఎల్జీబీటీల ప్రధాన డిమాండ్లు.. లైంగికంగా వెనక బడిన వర్గాల కింద పరిగణించాలి. మనిషిగా గుర్తింపు ఇవ్వాలి. గుర్తింపు కార్డులివ్వాలి. విద్య, వైద్యం, గృహ సౌకర్యాలు కల్పించాలి. రాజకీయాలలో రిజర్వేషన్ ఇవ్వాలి. గచ్చిబౌలి, న్యూస్‌లైన్: పురాతన కాలంలో సమ లైంగికుల పట్ల ఆదరణ చూపే వారని, ఆధునిక సమాజంలో అవహేళన చేస్తున్నారని శుభోదయ స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపకులు విద్య పేర్కొన్నారు. తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ హైటెక్‌సిటీ రైల్యే స్టేషన్ నుంచి శిల్పారామం వరకు సురక్ష సంస్థ ఆధ్వర్యంలో ‘హైదరాబాద్ క్యూర్ ప్రైడ్’ పేరిట ఎల్జీబీటీ(లెస్బియన్స్, గే, బై సెక్సువల్స్ అండ్ ట్రాన్స్‌జెండర్)లు ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీని సినీనటి మంచు లక్ష్మి ప్రారంభించారు. ఈ సందర్భంగా నల్సార్ యూనివర్సిటీకి చెందిన న్యాయవాది గిరిష్మ మాట్లాడుతూ ఆర్టికల్ 377ను సమర్ధిస్తూ సుప్రీం కోర్టు తీర్పు ఇవ్వడంతో ఎల్జీబీటీలు ఆందోళనకు గురవుతున్నారన్నారు. వారిది ప్రకృతి విరుద్ధమైన చర్యలు కావని సహజత్వం ద్వారానే అలా ఉన్నారని తెలిపారు. అవగాహన స్వచ్ఛంద సంస్థ ప్రాజెక్ట్ మేనేజర్ చంద్రముఖి మాట్లాడుతూ తామూ దేవుడు చేసిన మనుషులమేనని చెప్పారు. అనంతరం సమ లైంగికులు సమాజంలో ఎదుర్కొంటున్న సమస్యలను తెలియజేసే సాంస్కృతిక కార్యక్రమాలను ప్రదర్శించారు. మా సమస్యలపై హామీ ఇస్తేనే ఓటు వేస్తాం.. రాష్ట్ర వ్యాప్తంగా ఐదు లక్షల మంది ఉన్నాం. అందరికీ ఓటు హక్కు ఉంది. ఎల్జీబీటీల సమస్యలను మ్యూనిఫెస్టోలో పెట్టిన పార్టీకే ఓటు వేస్తాం. - కృష్ణ, సురక్ష వ్యవస్థాపకులు మమ్మల్ని ఆదరించండి.. సమలైంగికులంతా ఒక వేదికపై కలుస్తున్నాం. సమాజం మాపట్ల చూపుతున్న వివక్ష మాటలతో చెప్పలేం. మమ్మల్ని ఆదరించండి. - నవ్‌దీప్ సమాజం గుర్తించాలి.. సుప్రీంకోర్టు తీర్పు బాధకల్గిస్తోంది. అందరి మాదిరిగానే మాకు ప్రాథమిక హక్కులు కల్పించాలి. - షేన్, కాల్ సెంటర్ ఉద్యోగి ఆధార్‌కార్డు కూడా ఇవ్వడం లేదు.. రోడ్లపై నడుచుకుంటే వెళితే అవహేళన చేస్తారు. అన్నీ భరిస్తున్నాం. కనీసం ఆధార్ కార్డు కూడ ఇవ్వడం లేదు. మాలో చాలా మంది చదువుకున్న వాళ్లున్నారు. రిజర్వేషన్ సౌకర్యం కల్పించాలి. - శిరీష