మహారాష్ట్ర సీఎంగా షిండే ప్రమాణ స్వీకారం

Maharashtra Politics: Eknath Shinde Takes Oath As Chief Minister - Sakshi

సాక్షి, ముంబై: మహారాష్ట్ర 20వ సీఎంగా ఏక్‌నాథ్‌ షిండే ప్రమాణస్వీకారం చేశారు. షిండేతో గవర్నర్‌ భగత్‌ సింగ్‌ కోశ్యారీ రాజ్‌భవన్‌లో ప్రమాణ స్వీకారం చేయించారు. డిప్యూటీ సీఎంగా ఫడ్నవిస్‌ ప్రమాణ స్వీకారం చేశారు. ఉద్దవ్‌ సర్కార్‌ను కుప్పకూల్చిన శివసేన రెబెల్‌ నేత ఏక్‌నాథ్‌ షిండే ముఖ్యమంత్రి పదవిని దక్కించుకున్నారు. రాష్ట్ర రాజకీయాల్లో కింగ్‌ మేకర్‌ అవుతారకున్న షిండే అందరి అంచనాలను తలకిందులు చేస్తూ ఏకంగా కింగ్‌ అయ్యారు.

షిండే రాజకీయ ప్రస్థానం
1964 ఫిబ్రవరి 9న ఏక్‌నాథ్‌ షిండే జన్మించారు. యశ్వంతరావు వాన్‌ ఓపెన్‌ యూనివర్సిటీలో డిగ్రీ పూర్తి చేశారు. 1980లో శివసేన కార్యకర్తగా రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. 1997లో థానే మున్సిపల్ కార్పొరేషన్‌ ఎన్నికల్లో కార్పొరేటర్‌గా ఎన్నికయ్యాడు. 2004లో జరిగిన మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కోప్రి పచ్చపాఖాది నియోజకవర్గం నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచారు. తర్వాత వరసగా నాలుగుసార్లు అక్కడినుంచే గెలుస్తూ వచ్చారు.  2014లో ప్రతిపక్ష నేతగా, శివసేన శాసనసభా పక్ష నాయకుడిగా పనిచేశారు. 2019 నవంబర్‌ 28 నుంచి ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని మహా వికాస్ అఘాడి ఆధ్వర్యంలో ప‌ట్ట‌ణ వ్య‌వ‌హారాల శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు.
చదవండి: ‘మహా’ ట్విస్ట్‌.. సీఎం పీఠం వదులుకున్న బీజేపీ..

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top