మావోయిస్టులకు చెందిన రూ.5కోట్లు స్వాధీనం

Maharashtra Police Seize RS 5 Crores Belongs To Maoist - Sakshi

మహారాష్ట్ర సరిహద్దులో భారీగా నగదు స్వాధీనం చేసు​కున్న పోలీసులు

సాక్షి, ముంబై: మహారాష్ట్ర సరిహద్దులో భారీగా నగదు పట్టుబడింది. మావోయిస్టులకు సంబంధించిన 5 కోట్ల రూపాయలను సోమవారం ఉదయం మహారాష్ట్ర పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మహారాష్ట్ర-మధ్యప్రదేశ్ సరిహద్దులోని శివారు ప్రాంతమైన గోరఖ్ దందా గ్రామంలో రూ .5 కోట్ల అక్రమ రవాణాకు సంబంధించి ఎనిమిది మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. తెలంగాణా మావోయిస్టులకు ఇవ్వడానికి ఈ డబ్బులు తీసుకెళ్తున్నారని పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. పట్టుబడిన నగదుకు సంబంధించి పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

చదవండి: బావ కోసం దళంలో చేరి...

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top