Maharashtra Survey: పిల్లల్ని బడికి పంపించేది లేదు! 

Maharashtra Parents do not Want to Send Children to School: Survey - Sakshi

ముంబై: రాష్ట్రంలో బడులు తెరుచుకున్నా పిల్లల్ని బడికి పంపించేది లేదని విద్యార్థుల తల్లిదండ్రులు తెగేసి చెబుతున్నారు. సోమవారం నుంచి బడులు పునః ప్రారంభం కానున్న దృష్ట్యా ఓ సంస్థ నిర్వహించిన సర్వేలో సగానికిపైగా తల్లిదండ్రులు తమ పిల్లల్ని బడికి పంపించేందుకు సిద్ధంగా లేరని వెల్లడైంది. రాష్ట్రంలో కరోనా మూడో విడతలో కేసులు విపరీతంగా పెరిగిపోవడంతో ఫిబ్రవరి 15 వరకు విద్యాసంస్థల్ని రాష్ట్రప్రభుత్వం మూసివేసిన నేపథ్యంలో విద్యార్థులు తీవ్రంగా నష్టపోతున్నారంటూ నిన్న మొన్నటివరకు తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. అయితే సోమవారం నుంచి విద్యాసంస్థల పునఃప్రారంభించ వచ్చని రాష్ట్ర ప్రభుత్వం అనుమతించడంతో బడులు తెరిచేందుకు ఏర్పాట్లను సిద్ధం చేస్తున్నారు.

ఈ నేపథ్యంలో ఆన్‌లైన్‌ కమ్యూనిటీ ఫ్లాట్‌ఫామ్‌ లోకల్‌ సర్కిల్స్‌ వారు రాష్ట్రంలోని టైర్‌ 1, టైర్‌ 2, టైర్‌ 3, టైర్‌4 నగరాల్లో సుమారు 4976 మంది తల్లిదండ్రుల అభిప్రాయాలను ఆన్‌లైన్‌ ద్వారా సేకరించారు. ఈ సర్వేలో 62%మంది తమ పిల్లల్ని సోమవారం నుంచి బడులకు పంపించేందుకు సిద్ధంగా లేరని వెల్లడైంది.  67% మంది పురుషులు, 33 శాతం మంది మహిళల నుంచి అభిప్రాయాలను సేకరించారు. అయితే 11 శాతం మంది తల్లిదండ్రులు మాత్రమే తమ పిల్లల్ని బడులకు పంపించేందుకు సిద్ధంగా ఉన్నట్లు వెల్లడైంది. 16 శాతం మంది ఇప్పటికే తమ పిల్లల్ని బడులకు పంపిస్తున్నట్లు తేలింది. అదేసమయంలో 11 శాతం మంది ఏ నిర్ణయాన్ని చెప్పలేదు.  

చదవండి: (UP Assembly Election 2022: ‘మాణిక్‌పూర్‌’కా మాలిక్‌ కౌన్‌!) 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top