బస్టాండ్‌లో ప్రియుడి కోసం ఇద్దరమ్మాయిల డిష్యుం.. ఈ గ్యాప్‌లో ప్రియుడు ఏం చేశాడంటే.. 

Maharashtra: Girls Fight In Public Over Common Boyfriend - Sakshi

ఔరంగాబాద్‌: ఇద్దరు టీనేజర్లు.. ఒకే కుర్రాడిని ప్రేమించారు. కాదు.. కాదు.. ఆ కుర్రాడే ఒకరికి తెలియకుండా మరొకరిని మ్యానేజ్‌ చేసుకుంటూ వచ్చాడు. చివరికి విషయం బయటపడేసరికి.. కుర్రాడి కాలర్‌ పట్టుకుని నిలదీయాల్సిన ఆ అమ్మాయిలు.. వాళ్లలో వాళ్లే ఒకరి జుట్టు మరొకరు పట్టుకుని బాహాబాహీకి దిగారు. 

మహారాష్ట్రలోని పయ్‌థాన్‌ జిల్లా కేంద్రంలో బుధవారం ఉదయం ఈ ఘటన జరిగింది. ఇద్దరమ్మాయిల్లో.. ఒక అమ్మాయి సదరు కుర్రాడితో కలిసి స్థానిక బస్టాండ్‌కు చేరుకుంది. ఆ సమయంలో మరో అమ్మాయి కూడా అక్కడే ఉంది. వీళ్లిద్దరినీ గమనించి.. దగ్గరకు వచ్చి నిలదీసింది. 

విషయం తేలేసరికి.. ప్రియుడు తనవాడంటే తనవాడంటూ ఇద్దరు జుట్టు జుట్టు పట్టుకుని తన్నుకున్నారు. అక్కడే ఉన్న కొందరు వీళ్లను నిలువరించే ప్రయత్నం చేసినప్పటికీ.. లాభం లేకపోయింది. ఈ గ్యాప్‌లో ప్రియుడు అక్కడి నుంచి పరారయ్యాడు. 

అయినా అదేం పట్టించుకోకుండా ఆ యువతులు ఫైటింగ్‌ కొనసాగించారు. ఈలోపు పోలీసులు వచ్చి.. ఇద్దరినీ స్టేషన్‌కు తరలించి కౌన్సెలింగ్‌ ఇప్పి పంపించారు.

ఇదీ చదవండి: చిన్నారుల స్టెప్పులకు కేటీఆర్‌ ఫిదా

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top