మహాకుంభమేళాకే హైలైట్‌.. సోషల్‌ మీడియాలో చక్కర్లు | Maha Kumbh Mela 2025 From IIT Baba To Monalisa And Ascetics, Know Some Interesting And Shocking Facts | Sakshi
Sakshi News home page

Mahakumbh-2025: 10 ప్రత్యేక ఆకర్షణలు.. సోషల్‌ మీడియాలో చక్కర్లు

Jan 27 2025 7:15 AM | Updated on Jan 27 2025 4:41 PM

Mahakumbh-2025 From IIT Baba to Monalisa Shocking Facts and Ascetics

ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో ప్రస్తుతం జరుగుతున్న కుంభమేళా యావత్‌ ప్రపంచం దృష్టిని అమితంగా ఆకర్షిస్తోంది. ఈ అద్భుతమైన కార్యక్రమంలో పాల్గొనేందుకు కోట్లాది మంది భక్తులు తరలివస్తున్నారు. అయితే ఇక్కడికి వస్తున్నవారిలో కొందరు అనూహ్యరీతిలో ప్రత్యేక గుర్తింపు పొందుతున్నారు. దీనికి వారిలో ఉన్న ఏదో ఒక విశిష్ట లక్షణం కారణంగా నిలుస్తోంది. దీంతోవారు సోషల్‌ మీడియా కుంభమేళా స్టార్లుగా నిలుస్తున్నారు.

1. ఐఐటీ బాబా
ఐఐటీ పట్టభద్రుడైన అభయ్ సింగ్ ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహా కుంభమేళాలో అందరి దృష్టిని ఆకర్షించారు. చదువును, మంచి ఉద్యోగాన్ని వదిలిపెట్టిన అభయ్ సింగ్ గురించి తెలుసుకోవాలని చాలామంది ఆసక్తి చూపుతున్నారు.  కొద్దిరోజ్లులోనే అభయ్‌సింగ్‌ ఇన్‌స్టాగ్రామ్‌లో లక్షలాది మంది అభిమానులను సంపాదించుకున్నారు.

2. అమ్మాయిల గంగా హారతి
మహా కుంభమేళాలో సంగమం తీరంలో హారతి ఇచ్చే అవకాశం కొందరు అమ్మాయిలకు  దక్కింది. త్రివేణి సంగమంలో ప్రతిరోజూ ఏడుగురు  అమ్మాయిలు గంగా హారతికి సారధ్యం వహిస్తున్నారు. హారతి సమయంలో ఈ అమ్మాయిలు ఢమరుకం వాయిస్తూ, పూజలు నిర్వహిస్తున్నారు.

3. బవండర్‌ బాబా
మధ్యప్రదేశ్ నుండి మహా కుంభ్‌కు వచ్చిన బవండర్‌ బాబా  సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారారు. ఈ బాబా దివ్యాంగుడు కావడంతో మూడు చక్రాల వాహనంపై ప్రయాణం సాగిస్తుంటాడు. హిందూ దేవుళ్లు, దేవతల విగ్రహాలు, చిత్రాలపై జనానికి అవగాహన కల్పిస్తాడు.

4. తేనె కళ్ల మోనాలిసా
మహా కుంభమేళాలో పూసల దండలు అమ్ముకునే ఒక సాధారణ అమ్మాయి మోనాలిసా సోషల్‌ మీడియా స్టార్‌గా మారిపోయింది. ఆమెకు సంబంధించిన వీడియోలు ఇంటర్నెట్‌లో చక్కర్లు కొడుతున్నాయి.  

5. విదేశీయుల ఆశ్రమం
మహా కుంభ్‌లో విదేశీ మహామండలేశ్వరుల ఆశ్రమం ప్రత్యేకంగా నిలిచింది. ఇక్కడున్న తొమ్మిది మంది మహామండలేశ్వరులు విదేశీయులు. పైగా వీరంతా సంస్కృతంలో సంభాషిస్తున్నారు.

6. అంబాసిడర్‌ బాబా
అంబాసిడర్ బాబా ప్రయాగ్‌రాజ్ మహా కుంభ్‌లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఈ బాబా పేరు మహంత్ రాజ్ గిరి నాగ బాబా. ఆయన నిరంతరం తన అంబాసిడర్ కారులో ప్రయాణిస్తుంటారు. దానిలోనే నివాసం కూడా ఏర్పరుచుకున్నారు.

7. 11 కోట్ల మంది  రాక
మహా కుంభమేళాకు పది రోజులలో దాదాపు 11 కోట్ల మంది పర్యాటకులు వచ్చారు. వారి సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. మహా కుంభ స్నానం జనవరి 13న పుష్య పూర్ణిమతో ప్రారంభమైంది. రెండవ స్నానోత్సవం మకర సంక్రాంతి నాడు జరిగింది.  

8. డిజిటల్ మౌని బాబా
డిజిటల్ మౌని బాబా రాజస్థాన్‌లోని ఉదయపూర్ నివాసి. ఆయన 12 సంవత్సరాలుగా మౌన వ్రతం పాటిస్తున్నారు. ఆయన డిజిటల్ మాధ్యమం ద్వారా వివిధ విషయాలను శిష్యులకు తెలియజేస్తుంటారు.

9. ముక్కుతో వేణువు వాయించే బాబా
పంజాబ్‌లోని పటియాలా నుండి మహా కుంభ్‌కు వచ్చిన ఈశ్వర్ బాబా ఒకేసారి రెండు వేణువులను వాయిస్తారు. ఈయన తన ముక్కుతో కూడా వేణువును వాయిస్తుంటారు. దీంతో ఆయనను అంతా బన్సూరి బాబా అని  పిలుస్తుంటారు

10. పర్యావరణ బాబా
ఆవాహన్ అఖాడాకు చెందిన ఆచార్య మహామండలేశ్వర్ అరుణ గిరి కూడా మహా కుంభమేళాలో అందరినీ ఆకర్షిస్తున్నారు. 2016లో ఆయన వైష్ణో దేవి నుండి కన్యాకుమారి వరకు 27 లక్షల మొక్కలను పంపిణీ చేశారు. దీంతో ఆయనను పర్యావరణ బాబా అని పిలుస్తుంటారు.

ఇది కూడా చదవండి: Maha Kumbh 2025: తేనె కళ్ల మోనాలిసా ఇల్లు ఇదే.. వైరల్‌ వీడియో

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement