
భోపాల్:మధ్యప్రదేశ్(MadhyaPradesh)లో పరశురామ్ కల్యాణ్ బోర్డు(Parashuram Kalyan Board) ఓ ఆసక్తికర ప్రకటన చేసింది. తమ సామాజికవర్గాన్ని పెంచుకునేందుకు బ్రాహ్మణులు ఎక్కువ మంది పిల్లలను కనాలిని పిలుపునిచ్చింది. సోమవారం(జనవరి13) జరిగిన ఓ కార్యక్రమంలో పరశురామ్ కల్యాణ్ బోర్డు అధ్యక్షుడు పండిత్ విష్ణు రాజోరియా ఈ మేరకు ఓ ప్రకటన చేశారు.
మనం మన కుటుంబాలపై దృష్టి పెట్టడం లేదని,ఈ మధ్య యువత ఒక బిడ్డతో సరిపెడుతున్నారన్నారు. ఇది చాలా సమస్యాత్మకంగా మారిందన్నారు. భవిష్యత్ తరాన్ని కాపాడాల్సిన బాధ్యత మనదేనన్నారు. అందుకే కనీసం నలుగురు సంతానం ఉండాలని పిలుపునిచ్చారు.
నలుగురు పిల్లల్ని కనే మహిళలకు బోర్డు తరఫున రూ.లక్ష నజరానా అందిస్తామని ప్రకటించారు.తాను బోర్డు అధ్యక్షుడిగా దిగిపోయిన తర్వాత కూడా ఈ అవార్డు కొనసాగుతుందని రాజోరియా స్పష్టం చేశారు.రాజోరియా చేసిన ప్రకటన ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.
ఇదీ చదవండి: ఇంటి నుంచే కుంభమేళా స్నానం..ఎలాగంటే..