వీడియో: కురులతో భారత కుర్రాడు.. గిన్నిస్‌ బుక్‌ ఎక్కేశాడు

longest hair Sidakdeep Singh Chahal sets Guinness World Record - Sakshi

లండన్‌: చిన్నప్పుడు స్నేహితులతో ఆడుకుంటుంటే.. అంతా అతన్ని ఏడిపించేవారట. అమ్మాయిలా.. ఆ జుట్టేంట్రా అని టీజ్‌ చేసేవారట. అది అతన్ని ఎంతో బాధించేదట. ఇంట్లో గోల చేసి మరీ ఆ జుట్టును తొలగించే ప్రయత్నమూ చేశాడట. కానీ, మత సంప్రదాయాలు(సిక్కు) పాటించే ఆ తల్లిదండ్రులు.. అతనికి సర్దిచెప్పారు. అలా 15 ఏళ్లపాటు అతను ఓర్పుగా పెంచుకున్న జుట్టు అతనిప్పుడు పాపులర్‌ని చేసింది. 

15 ఏళ్ల సిదక్‌దీప్‌ సింగ్‌ చాహల్‌.. ప్రపంచంలోనే అతిపొడవైన జుట్టు ఉన్న టీనేజర్‌గా(కుర్రాడు) గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డుల్లోకి ఎక్కాడు. ఉత్తర ప్రదేశ్‌కు చెందిన సిదక్‌దీప్‌.. పుట్టినప్పటి నుంచి ఇప్పటిదాకా అతను జుట్టు తీసింది లేదట. అలా అదిప్పుడు 146 సెంటీమీటర్లు పెరిగి గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డ్స్‌ 2024 బుక్‌లో చోటు దక్కేలా చేసింది. 

పెరిగేకొద్దీ ఒకానొక టైంలో.. నాకు జుట్టు మీద ఇష్టం పెరిగింది. కానీ, దానిని మెయింటెన్‌ చేయడం అంత సులువు కాదు. వారానికి రెండు సార్లు తలస్నానం చేస్తాను. కనీసం ఓ గంట పడుతుంది. జుట్టు శుభ్రం చేసుకోవడానికి మా అమ్మ నాకు సాయం చేస్తారు. లేదంటే నాకు ఓ రోజంతా సమయం పడుతుందేమో!.రికార్డు వచ్చిందని చెప్పినప్పుడు మా బంధువులు, నా స్నేహితులు ఎవరూ నమ్మలేదు::: సిదక్‌దీప్‌

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top