సెల్యూట్‌తో అలరిస్తున్న బుడ్డోడు | Little Boy From Leh Salutes Passing Soldiers Becomes Viral | Sakshi
Sakshi News home page

సెల్యూట్‌తో అలరిస్తున్న బుడ్డోడు

Oct 11 2020 9:17 PM | Updated on Oct 11 2020 9:29 PM

Little Boy From Leh Salutes Passing Soldiers Becomes Viral - Sakshi

లేహ్‌ : చిన్న పిల్లలు ఏం చేసినా మనకు ముద్దొస్తుంటుంది. వారు చేసే అల్లరితో మనం ఉదయం నుంచి పడిన శ్రమనంతా మరిచిపోతాం. వాళ్లు గలగలా నవ్వితే ఇంట్లో పండుగ వాతావరణం వెల్లివిరుస్తుంది. కొందరు చిన్నారులు తమ చిలిపి చేష్టలతో ఆకట్టుకుంటుంటారు. తాజాగా ఒక బుడ్డోడు చేసిన పని ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారి ఎమోషనల్‌కు గురిచేస్తుంది. ఒక పిల్లాడు తన ముందు నుంచి వెళ్తున్న సైనికులకు సెల్యూట్‌ చేసి అందరిచేత శభాష్‌ అనిపించుకున్నాడు. సైనికుల పట్ల ఇలా గౌరవం తెలుపాలని స్ఫూర్తిదాయకంగా నిలిచాడు. లేహ్‌ నుంచి వెళ్తున్న భారత సైనికులకు సెల్యూట్‌ చేస్తున్న వీడియోను ఇండియన్‌ ఫారెస్ట్‌ సర్వీస్‌ అధికారి సుధా రామెన్‌ ట్విట్టర్‌లో షేర్‌ చేశారు. ఈ వీడియోను చూసిన నెటిజెన్లు ఎందరో బుడ్డోడి సెల్యూట్‌కు ముగ్ధులయ్యారు.కొన్ని గంటల్లోనే ఈ వీడియో వైరల్‌గా మారింది.(చదవండి : వైరలవుతున్న కేరళ బామ్మ ఆవేదన)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement