చిక్కిన చిరుతపులి మృతి  | Leopard Last Breath After Caught By Villagers In Odisha | Sakshi
Sakshi News home page

చిక్కిన చిరుతపులి మృతి 

Jan 30 2021 9:11 AM | Updated on Jan 30 2021 9:11 AM

Leopard Last Breath After Caught By Villagers In Odisha - Sakshi

వలలో చిక్కుకున్న చిరుతపులి

సాక్షి, భువనేశ్వర్‌: గంజాం జిల్లా దక్షయ ఘముసర అటవీ డివిజన్‌ బుగుడా రేంజ్‌ పరిధిలోని నగురు గ్రామ శివారులో గ్రామస్తులు అడవి పందుల కోసం వేసిన వలలో గురువారం చిరుతపులి చిక్కుకుంది. సమాచారం అందుకున్న దక్షయ ఘముసర అటవీ డివిజన్‌ అధికారులు ఘటనా స్థలానికి చేరుకొని చిరుతపులిని అధీనంలోకి తీసుకొన్నారు. వెటర్నరీ వైద్యుల సాయంతో చికిత్స అందించారు. అయితే చిరుతపులి తీవ్ర అనారోగ్యంతో శుక్రువారం మృతి చెందిందని అటవీశాఖ డివిజనల్‌ అధికారి సత్యనారాయణ బౌరా తెలిపారు. సుమారు ఏడాదిన్నర వయస్సున్న ఈ జీవాన్ని నిబంధనల ప్రకారం ఘుమసరా అటవీ ప్రాంతంలో పూడ్చినట్లు వెల్లడించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement