వచ్చే ఏడాదికి ఎత్తైన రైలు వంతెన!

Largest Railway Bridge Connecting Kashmir Come in to Force by Next Year - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: జమ్మూకశ్మీర్‌లో చీనాబ్‌ నదిపై నిర్మిస్తున్న ప్రపంచంలోనే అతిఎత్తైన రైల్వే వంతెన పనులు వచ్చే ఏడాదికి పూర్తికానున్నాయి. కశ్మీర్‌ ను మిగతాదేశంతో కలిపే ఈ వారధిపై 2022 డిసెంబర్‌లో మొట్టమొదటి రైలు ప్రయాణం చేసే అవకాశాలున్నాయని అధికారులు తెలిపారు. 359 మీటర్ల ఎత్తులో 467 మీటర్ల పొడవైన ఈ వారధి ప్రపంచంలోనే అతి పొడవైన రైల్వే వంతెన. గంటకు 266 కిలోమీటర్ల వేగంతో వీచే గాలులను సైతం తట్టుకునేలా ఈ వంతెనను డిజైన్‌ చేసినట్లు అధికారులు పేర్కొన్నారు.

కేంద్రం ప్రత్యక్ష పర్యవేక్షణతో ఏడాదిగా పనులు వేగవంతం అయ్యాయన్నారు. ఈ రైల్వే మార్గంలో ఉధంపూర్‌–కాట్రా(25 కిలోమీటర్లు) సెక్షన్, బనిహాల్‌– క్వాజిగుండ్‌ (18 కి.మీ.)సెక్షన్, క్వాజిగుండ్‌–బారాముల్లా (118 కి.మీ.) సెక్షన్‌ల పనులు ఇప్పటికే పూర్తయ్యాయని తెలిపారు. ప్రస్తుతం 111 కిలోమీటర్ల పొడవైన కాట్రా–బనిహాల్‌ సెక్షన్‌లో పనులు కొనసాగుతున్నాయని అధికారులు చెప్పారు. 2018 వరకు ప్రాజెక్టు అంచనా వ్యయంలో 27 శాతమే ఖర్చు కాగా ఆ తర్వాత 54 శాతం మేర వెచ్చించినట్లు అధికారులు వివరించారు. చదవండి: ఆమెతో రాఖీ కట్టించుకో, 11 వేలు ఇవ్వు: కోర్టు

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top