లాలూ, ములాయం భేటీ | Lalu Prasad Yadav Meets Mulayam Singh Yadav | Sakshi
Sakshi News home page

లాలూ, ములాయం భేటీ

Aug 3 2021 4:22 AM | Updated on Aug 3 2021 4:45 AM

Lalu Prasad Yadav Meets Mulayam Singh Yadav - Sakshi

న్యూఢిల్లీ: ఢిల్లీ వేదికగా ఆర్జేడీ చీఫ్‌ లాలూ ప్రసాద్‌ యాదవ్, సమాజ్‌వాది పార్టీ చీఫ్‌ ములాయం సింగ్‌ యాదవ్‌లు సోమవారం భేటీ అయ్యారు. ఈ సమావేశంలో ములాయం కుమారుడు అఖిలేశ్‌ యాదవ్‌ కూడా పాల్గొన్నారు. దీనిపై లాలూ ప్రసాద్‌ సమావేశపు ఫొటోలతో కూడిన ట్వీట్‌ చేశారు.

అందులో ఆయన ‘దేశంలో మోస్ట్‌ సీనియర్‌ సోషలిస్టు మిత్రుడు ములాయం సింగ్‌ను కలిసి ఆయన ఆరోగ్యం గురించి వాకబు చేశాను. రైతులు, అసమానత, పేదరికం, నిరుద్యోగంపై పోరాడేం దుకు మాకు ఉమ్మడి భావాలున్నాయి’ అని పేర్కొ న్నారు. దేశంలో ఇప్పుడు సమానత, లౌకికత్వ అవసరం ఉందని  అభిప్రాయపడ్డారు.  

Advertisement
 
Advertisement
Advertisement