గుజరాత్‌లో అకాల వర్షాలు.. | Sakshi
Sakshi News home page

గుజరాత్‌లో అకాల వర్షాలు..

Published Tue, Nov 28 2023 5:42 AM

killed in unseasonal rains, lightning strikes at Gujarat - Sakshi

అహ్మదాబాద్‌: గుజరాత్‌ వ్యాప్తంగా ఆదివారం అకాల వర్షాలు కురుస్తున్నాయి. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో పిడుగులు పడిన ఘటనల్లో 20 మంది వరకు చనిపోయినట్లు రాష్ట్ర అత్యవసర విభాగం తెలిపింది.

దహోడ్‌ జిల్లాలో నలుగురు, భరూచ్‌లో ముగ్గురు, అహ్మదాబాద్, అమ్రేలీ, బనస్కాంత, బోటడ్, ఖేడా, మెహ్సానా, పంచ్‌మహల్, సబర్కాంత, సూరత్, సురేంద్రనగర్, దేవ్‌భూమి ద్వారకల్లో ఒక్కొక్కరి చొప్పున మృతి చెందారని ఒక అధికారి చెప్పారు. రాష్ట్రంలోని 252 తాలుకాలను గాను 234 చోట్ల ఆదివారం వర్షపాతం నమోదైనట్లు వెల్లడించారు. అకాల వర్షాలతో పంటలు దెబ్బతిన్నాయని, సౌరాష్ట్ర ప్రాంతంలోని సెరామిక్‌ పరిశ్రమలు మూతపడ్డాయని చెప్పారు. వచ్చే 24 గంటల్లో రాష్ట్రానికి మరింత వర్ష సూచన ఉన్నట్టు వాతావరణ శాఖ వెల్లడించింది.

Advertisement
Advertisement