ఈనెల 16న హైదరాబాద్‌లో సీడబ్ల్యూసీ సమావేశం.. హాజరుకానున్న ఖర్గే

KC Venugopal Says New CWC Meeting In Hyderabad September 16th - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: సెప్టెంబర్ 16న హైదరాబాద్‌లో కొత్తగా కొలువుదీరిన కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ (సీడబ్ల్యూసీ) సమావేశం జరగనున్నట్లు ఏఐసీసీ సంస్థాగత వ్యవహారాల ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ వెల్లడించారు. కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన ఈ సమావేశం జరగనున్నట్లుత తెలిపారు. 16 తేదీ సమావేశానికి సీడబ్ల్యూసీ శాశ్వత ఆహ్వానితులు, ప్రత్యేక ఆహ్వానితులు హాజరుకానున్నట్లు పేర్కొన్నారు. 

17 తేదీ విస్తృత స్థాయి వర్కింగ్ కమిటీ సమావేశం ఉందని తెలిపారు. ఆరోజు సీడబ్ల్యూసీ సభ్యులు, పీసీసీలు, సీఎల్పీలు, కాంగ్రెస్‌ పార్లమెంటరీ పార్టీ ఆఫీస్‌ బేరర్లు హాజరువతారని కేసీ వేణుగోపాల్‌ పేర్కొన్నారు.సెప్టెంబర్ 17 సాయంత్రం హైదరాబాద్‌కు సమీపంలో మెగా ర్యాలీ నిర్వహించనున్నట్లు చెప్పారు. ఈ ర్యాలీలో మల్లికార్జున ఖర్గేతో సహా పార్టీ మాజీ అధ్యక్షులు, సీనియర్‌ నేతలు పాల్గొంటారని తెలిపారు.
చదవండి: తెలంగాణలో కుండపోత వర్షాలు.. అక్కడ స్కూళ్లకు సెలవులు

కాగా సెప్టెంబర్ 17 మెగా ర్యాలీతో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి కాంగ్రెస్  శ్రీకారం చుట్టనున్నట్లు చెప్పారు. ఈ ర్యాలీలోనే ఎన్నికలకు 5 గ్యారెంటీ స్కీమ్స్ ప్రకటించనుందని తెలిపారు. అదే రోజు 119 నియోజకవర్గాల్లో సీడబ్ల్యూసీ సభ్యులు, పీసీసీ అధ్యక్షులు, సీఎల్పీలు బస చేయనున్నారని, సెప్టెంబర్ 18న బీఆర్‌ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ నేతలు తమ తమ నియోజకవర్గాల్లో ఇంటింటికీ ప్రచారం నిర్వహించనున్నారన్నారు.  

వైఎస్సార్‌టీపీ అధ్యక్షురాలు షర్మిల కాంగ్రెస్ పార్లమెంటరి పార్టీ అధ్యక్షులు సోనియాగాంధీ ,రాహుల్ గాంధీని కలిశారని, చాలా మంచి సమావేశం జరిగిందన్నారు కేసీ వేణుగోపాల్‌. అయితే షర్మిల చేరిక, పార్టీ విలీనంపై ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. షర్మిల చేరికపై వేచి చూడాలని తెలిపారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top