Karnataka Results Not Effect On Telangana Says Minister KTR, Tweet Goes Viral - Sakshi
Sakshi News home page

కేరళ స్టోరీలాగే.. కర్ణాటక ఫలితాలపై కేటీఆర్‌ స్పందన

May 13 2023 3:38 PM | Updated on May 13 2023 7:57 PM

Karnataka Results Not Effect On Telangana Says KTR - Sakshi

కేరళ స్టోరీ సినిమా పొరుగు రాష్ట్రమైన కర్ణాటక ప్రజలను.. 

హైదరాబాద్‌: కర్ణాటక ఎన్నికల ఫలితాలపై బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, తెలంగాణ మంత్రి కేటీఆర్‌ స్పందించారు. ఆ ఫలితాలు తెలంగాణపై ఎలాంటి ప్రభావం చూపించబోవని ట్వీట్‌ చేశారాయన.     

కేరళ స్టోరీ సినిమా పొరుగు రాష్ట్రమైన కర్ణాటక ప్రజలను ఆకట్టుకోవడంలో ఎలా విఫలమైందో.. అదే విధంగా కర్ణాటక రాష్ట్ర ఎన్నికల ఫలితాలు తెలంగాణపై ఎటువంటి ప్రభావం చూపబోవని మంత్రి కేటీఆర్‌ ట్వీట్‌ చేశారు. విభజనవాద రాజకీయాలను తిరస్కరించిన కర్ణాటకవాసులకు కృతజ్ఞతలు తెలియజేశారు. 

హైదరాబాద్‌, బెంగళూరుల మధ్య ఆరోగ్యకర పోటీ నెలకొనాలని ఆకాంక్షించారు. కర్ణాటకలో కొత్త కాంగ్రెస్ ప్రభుత్వానికి నా శుభాకాంక్షలు అని తెలియజేశారాయన.

ఇదీ చదవండి: సీఎం అభ్యర్థిపై ఖర్గే క్లారిటీ 

Advertisement
 
Advertisement
Advertisement