యూనీసెఫ్ ఇండియా నేషనల్ అంబాసిడర్‌గా 'కరీనా కపూర్' | Sakshi
Sakshi News home page

యూనీసెఫ్ ఇండియా నేషనల్ అంబాసిడర్‌గా 'కరీనా కపూర్'

Published Sat, May 4 2024 8:44 PM

Kareena Kapoor Appointed UNICEF India National Ambassador

ఢిల్లీ: యూనీసెఫ్ ఇండియా (యునైటెడ్‌ నేషన్స్‌ ఇంటర్నేషనల్‌ చిల్డ్రన్స్‌ ఎమర్జెన్సీ ఫండ్) తన కొత్త జాతీయ అంబాసిడర్‌గా బాలీవుడ్ స్టార్ 'కరీనా కపూర్'ను ప్రకటించింది. 2014 నుంచి యునిసెఫ్ ఇండియాతో సంబంధం కలిగి ఉన్న ఈమె ఆరోగ్యం, విద్య, లింగ సమానత్వం కోసం ప్రతి పిల్లల హక్కును పెంపొందించడంలో కీలక పాత్ర పోషిస్తున్నారు.

కరీనా ఇంతకు ముందు యునిసెఫ్ ఇండియాకు సెలబ్రిటీ అడ్వకేట్‌గా పనిచేశారు. కాగా ఇప్పుడు నూతన బాధ్యతలు స్వీకరించారు. ఇప్పుడు భారత జాతీయ రాయబారిగా యునిసెఫ్‌తో నా అనుబంధాన్ని కొనసాగించడం నాకు గౌరవంగా ఉంది కరీనా పేర్కొన్నారు. ప్రతి బిడ్డకు బాల్యం, సమానమైన అవకాశం, భవిష్యత్తు అవసరం అని ఆమె పేర్కొన్నారు.

Advertisement
 
Advertisement

తప్పక చదవండి

 
Advertisement