కరణ్‌ జోహార్‌ ఇంటర్వ్యూ.. అలియా క్యూట్‌ క్యూట్‌ సమాధానాలు

Karan Johar dropped a video Of Alia Bhatt Playing Rapid Fire Round With Shooting Rocky Aur Rani Ki Prem Kahani - Sakshi

రాకీ ఔర్ రాణి కి ప్రేమ్ కహానీ’ షూటింగ్‌ విరామ సమయంలో అలియా భట్‌తో సరదాగా చేసిన ఇంటర్వ్యూకి సంబంధించిన  ఒక వీడియోను కరణ్ జోహార్ ఇన్‌స్టాగామ్‌లో పోస్ట్‌ చేశారు. దీంతో ఈ వీడియో  ప్రస్తుతం నెట్టింట తెగ హల్‌చల్‌ చేస్తుంది.

ఈ వీడియోలో కరణ్‌ జోహార్‌ హోస్ట్‌గా ఉండి అలియాను రకరకాల ప్రశ్నలతో ఇంటర్వ్యూ చేస్తాడు.  ఆ వీడియోలా కరణ్‌ మనం ఇప్పుడూ షుటింగ్‌ చేస్తున్నాం అవునా అంటే దానికి అలియా అవును రాకీ ఔర్ రాణి కి ప్రేమ్ కహానీ" షూటింగ్‌ అంటూ తడబడుతూ సమాధానం ఇస్తుంది. రాకీ ఎక్కడ ఉన్నాడు అని అలియాను కరణ్‌ ప్రశ్నిస్తాడు.

ఆ ప్రశ్నకి అలియా రాకీ వర్కవుట్‌లో ఉన్నాడంటోంది. ఇలా ప్రశ్నల పరంపర జరుగుతుండగా ఒకచోట అలియా టంగ్‌ స్లిప్‌ అవ్వడంతో ఆటపట్టిస్తాడు. అంతేకాదు ఈ వీడియోలో తనకు సక్సెస్‌ సాధించిన వ్యక్తులను చూడటం ఇష్టమని, పైగా కరణ్‌కి పద్మశ్రీ అవార్డు వచ్చిన క్షణం తను ఎంతగానో సంతోషించనంటూ అలియా వెల్లడిస్తోంది. దీంతో నెటిజన్లు కరణ్‌ హోస్ట్‌గా అలియాను ఇంటర్వ్యూ చేసే  విధానం నచ్చిందంటూ రకరకాలుగా ట్వీట్‌ చేశారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top