హోలీ రోజు జపాన్ యువతిని వేధించిన ఆకతాయిలు.. వీడియో వైరల్‌.. | Japanese Girl Being Groped On Holi Video Goes Viral Delhi | Sakshi
Sakshi News home page

జపాన్ యువతిని వేధించిన ఆకతాయిలు.. బలవంతంగా రంగులు పూసి.. తలపై కోడిగుడ్డు పగలగొట్టి..

Mar 10 2023 9:13 PM | Updated on Mar 10 2023 9:31 PM

Japanese Girl Being Groped On Holi Video Goes Viral Delhi - Sakshi

న్యూఢిల్లీ: హోలీ పండుగ రోజు ఢిల్లీలో కొందరు ఆకతాయిలు రెచ్చిపోయారు. విదేశీయురాలు అని కూడా చూడకుండా జపాన్ యువతిని వేధించారు. బలవంతంగా ఆమెకు రంగులు పూసి, కోడిగుడ్డును తలపై పగలగొట్టారు. ఆమె వద్దని చెబుతున్నా పట్టించుకోకుండా ఇబ్బందిపెట్టారు. వీరి తీరుతో ఆగ్రహించిన సదరు యువతి గ్యాంగ్‌లో ఒకడి చెంపచెళ్లుమనిపించింది. అనంతరం అక్కడి నుంచి ఇంట్లోకి వెళ్లిపోయింది.

సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారిన ఈ వీడియోపై ఢిల్లీ మహిళా కమిషన్ చీఫ్ స్వాతి మలివాల్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. భారతీయులు సిగ్గపడే విధంగా ఈ ఆకతాయిలు ప్రవర్తించారని మండిపడ్డారు. ఈ ఘటనపై ఢిల్లీ పోలీసులకు నోటీసులు పంపి కేసు నమోదు చేయాలని పేర్కొన్నారు.

అయితే ఈ వీడియోను బాధితురాలు సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేసి వెంటనే డిలీట్ చేసినట్లు తెలుస్తోంది. కొందరు నెటిజన్లేమో ఇది పాత వీడియో అయి ఉండొచ్చని, మళ్లీ చక్కర్లు కొడుతోందని పేర్కొన్నారు. ఘటనకు సంబంధించి ఎలాంటి ఫిర్యాదు కూడా పోలీసులకు అందలేదు.

ఢిల్లీ పోలీసులు ఈ వీడియోను చూసిన అనంతరం జపాన్ యువతి వివరాల కోసం ఎంబసీకి లేఖ రాశారు. అలాగే వీడియోలో అమ్మాయిని వేధించిన యువకుల వివరాలను సేకరించారు.
చదవండి: సీజనల్‌ ఇన్‌ఫ్లూయెంజాపై కేంద్రం కీలక ప్రకటన..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement