భారత 14వ ఉప రాష్ట్రపతిగా జగదీప్‌ ధన్‌కర్‌ ప్రమాణ స్వీకారం

Jagdeep Dhankhar Takes Oath As India 14th Vice President - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: భారత 14వ ఉప రాష్ట్రపతిగా జగదీప్‌ ధన్‌కర్‌ గురువారం ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్రపతి భవన్‌లో దర్భార్‌ హాల్‌లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆయన చేత ప్రమాణం చేయించారు. కాగా జగదీప్‌ ధన్‌ఖడ్‌ వృత్తి రీత్యా లాయర్‌. రాజకీయాల్లోకి వచ్చినా సుప్రీంకోర్టు లాయర్‌గా పని చేస్తూనే వచ్చారు. ఎంపీ నుంచి గవర్నర్‌గా, అక్కడి నుంచి తాజాగా ఉపరాష్ట్రపతి దాకా జనతాదళ్, కాంగ్రెస్‌ల మీదుగా బీజేపీ దాకా ఆయనది ఆసక్తికర ప్రస్థానం.

రాజస్థాన్‌ హైకోర్టులో లాయర్‌గా పచేసిన ధన్‌కర్‌.. మాజీ ఉప ప్రధాని చౌదరి దేవీలాల్‌ చొరవతో రాజకీయాల్లోకి అడుగు పెట్టారు. 1989లో లోక్‌సభకు ఎన్నికయ్యారు. 1990లో చంద్రశేఖర్‌ మంత్రివర్గంలో కేబినెట్‌ మంత్రిగా పనిచేశారు. 1991లో పీవీ నర్సింహారావు హయంలోనూ మంత్రిగా సేవలు అందించారు.
చదవండి: ఉప రాష్ట్రపతి జగదీప్‌ ధన్‌కర్‌ ప్రస్థానం.. రాజ్యాంగ పీఠంపై న్యాయ కోవిదుడు

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top