
న్యూఢిల్లీ: ఐపీఎస్ అధికారి పరాగ్ జైన్ రా(రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్) చీఫ్‌గా నియమితులయ్యారు. పంజాబ్‌కు చెందిన 1989 బ్యాచ్ పరాగ్ జైన్‌ను రవి సిన్హా స్థానంలో రా చీఫ్‌గా నియమించారు. రా సెక్రటరీగా విధులు నిర్వరిస్తున్న రవి సిన్హా పదవీకాలం ఈనెల 30వ తేదీతో ముగియనున్న నేపథ్యంలో సీనియర్ అధికారి అయిన పరాగ్ జైన్‌ను రా చీఫ్‌గా నియమించారు. ఆయన పదవీ కాలం రెండేళ్ల పాట కొనసాగనుంది. అంతకుముందు పరాగ్ జైన్.. చండీగడ్‌లో ఎస్‌ఎస్‌పీ(సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్)గా పని చేశారు. అలాగే కెనడా, శ్రీలంకల్లో దౌత్య ప్రతినిధిగా పని చేసిన అనుభవం పరాగ్‌జైన్‌కు ఉంది.
ఇటీవల భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్‌లో పరాగ్ జైన్ సైతం కీలక పాత్ర వహించారు. ప్రస్తుతం ఏవియేసన్ రీసెర్చ్ సెంటర్‌లో హెడ్‌గా పని చేస్తున్న పరాగ్ జైన్.. భారత చేపట్టిన ఆపరేషన్ సింధూర్‌లో ముఖ్యభూమిక పోషించారు. ఈ ఆపరేషన్‌లో భాగంగా భారత ఇంటెలిజెన్స్ విభాగానికి సంబంధించి కీలక సమాచారం అందించడంలో పరాగ్ జైన్ ప్రముఖ పాత్ర పోషించారు.
అలాగే జమ్మూ కశ్మీర్‌లోని ఉగ్రవాద కార్యకలాపాలకు వ్యతిరేకంగా చేపట్టిన ఆపరేషన్‌లో సైతం పరాగ్ తన వంతు పాత్రన సమర్ధవంతంగా నిర్వర్తించారు. ఫలితంగా పలు విభాగాల్లో పని చేసి విశేష అనుభవం గడించిన పరాగ్ జైన్‌ను రా చీఫ్‌గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. అయితే ఆయన అధికారికంగా జూన్ 30వ తేదీన బాధ్యతలు చేపట్టనున్నారు.