అగ్ని ప్రమాదం: 25 లక్షల విలువైన వ్యాక్సిన్లు దగ్దం

Indore: Vaccines Worth Rs 25 Lakhs Damaged In Fire At Godown - Sakshi

భోపాల్ :  భారత్‌లో కరోనా కేసులు, మరణాలు భారీ సంఖ్యలో పెరిగిపోతున్నాయి. ఓవైపు ఆసుపత్రుల్లో బెడ్స్‌, ఆక్సిజన్‌ దొరక్క కోవిడ్‌ భాదితులు అవస్థలు పడుతుంటే మరోవైపు దేశంలో వ్యాక్సిన్‌ కొరత ఏర్పడుతోంది. ఇలాంటి విప‌త్క‌ర ప‌రిస్థితుల్లో మ‌ధ్య‌ప్ర‌దేశ్ ఇండోర్‌లోని భార‌త్ సీర‌మ్స్ అండ్ వ్యాక్సిన్స్ లిమిటెడ్‌లో ఆదివారం రాత్రి భారీ అగ్నిప్ర‌మాదం సంభ‌వించింది. 

ఈ ప్రమాదంలో కంపెనీ గోడౌన్‌లో నిల్వ ఉంచిన క‌రోనా మెడిసిన్స్, వ్యాక్సిన్‌తో పాటు బ్లాక్ ఫంగ‌స్‌కు ఉప‌యోగించే మందులు పూర్తిగా కాలి బూడిదయ్యాయి. స‌మాచారం అందుకున్న అగ్నిమాప‌క సిబ్బంది ఘ‌ట‌నాస్థ‌లికి చేరుకుని మంట‌ల‌ను అదుపులోకి తీసుకొచ్చింది. అయితే అగ్నిప్ర‌మాదానికి గ‌ల కార‌ణాలు ఇంకా తెలియరాలేదు.ఇక ఈ ప్ర‌మాదం వ‌ల్ల రూ. 25 ల‌క్ష‌ల ఆస్తి న‌ష్టం సంభ‌వించిన‌ట్లు కంపెనీ యాజ‌మాన్యం ప్రాథ‌మికంగా నిర్ధారించింది.

చదవండి: బళ్లారి పారిశ్రామికవాడలో భారీ అగ్నిప్రమాదం

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top