ఇండిగో ఎయిర్‌పోర్ట్‌ మేనేజర్‌ కాల్చివేత.. సీఎంపై ఆగ్రహం

Indigo Manager Murder.. opposition slams on Govt - Sakshi

పాట్నా: ఇండిగో ఎయిర్‌పోర్ట్‌ మేనేజర్‌ రూపేశ్‌‌ కుమార్‌ దారుణ హత్యకు గురయ్యారు. మంగళవారం గుర్తు తెలియని ఇద్దరు వ్యక్తులు ఆయన్ని తుపాకీతో కాల్చి చంపారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. ఇండిగో ఎయిర్‌పోర్ట్‌ మేనేజర్‌ రూపేశ్‌‌ కుమార్ పాట్నా పునాయ్‌చక్‌లోని కుసుమ్‌ విలాస్‌ అపార్ట్‌మెంట్‌లో నివసిస్తున్నాడు. మంగళవారం సాయంత్రం 7 గంటలకు బయటకు రాగా ద్విచక్ర వాహనంపై వచ్చిన ఇద్దరు తుపాకితో అతడిపై కాల్పులకు తెగబడ్డారు. ఏకంగా ఆరు రౌండ్లు కాల్చారు. తీవ్ర గాయాలైన అతడిని ఆస్పత్రికి తరలించేలోగా మృతి చెందాడు. ఈ ఘటన బిహార్‌లో కలకలం రేపింది. రాజకీయంగా వివాదాస్పదమైంది.

ప్రతిపక్ష నాయకుడు తేజస్వి యాదవ్‌ తీవ్రస్థాయిలో నితీశ్‌ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. హంతకుల చేతిలో రాష్ట్రం ఉందని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈ ఘటనపై ఆయన దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రభుత్వం రక్షణ కల్పిస్తున్న నేరస్తులే రూపేశ్‌ను హతమార్చారని ఆరోపించారు. హంతకులు రాష్ట్రాన్ని పాలిస్తున్నారని మండిపడ్డారు. జన్‌ అధికార్‌ పార్టీ అధినేత పప్పూ యాదవ్‌ కూడా ఈ ఘటనపై స్పందించి రాష్ట్ర ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top